చేనేత, పవర్‌లూమ్ రంగం ద్వారా 4.5 కోట్ల మందికి ప్రత్యక్ష ఉపాధి 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతే లక్ష్యం కేంద్ర టెక్స్‌టైల్ కమిషనర్ వృందా మనోహర్ దేశాయ్
ఏపీకి ప్రత్యేక స్థానం
నగరి : దేశంలో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో చేనేత, పవర్‌లూమ్స్ రంగం ఒకటని, ఈ రంగం ద్వారా 4.5 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారని కేంద్ర టెక్స్‌టైల్ కమిషనర్ వృందా మనోహర్ దేశాయ్ తెలిపారు. మంగళవారం నగరి పట్టణంలోని పవర్‌లూమ్ యూనిట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఏకాంబరకుప్పం రైల్వే స్టేషన్‌న్ సమీపంలోని ఎస్‌ఎంటీ పొన్నుస్వామి శంకరమ్మాళ్ కల్యాణ మండపంలో నిర్వహించిన టెక్స్‌టైల్ స్టాటిస్టికల్ రిటర్న్స్ సిస్టమ్ (టీఆర్‌ఎస్‌ఆర్ ) పోర్టల్ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ వస్త్ర నాణ్యత అవసరమని, దీని పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వస్త్రాల ఎగుమతులు రూ.3.25 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధికమని తెలిపా రు. ప్రపంచంలోని 100కు పైగా దేశాలకు భారత వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయని, 2030 నాటికి 100 బిలియన్ అమెరికనన్ డాలర్ల విలువైన వస్త్ర ఎగుమతులను సాధించడమే లక్ష్యమన్నారు.
93 శాతం మహిళలే
సమర్థ్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 14,942 మంది అభ్యర్థులకు శిక్షణ అందించగా, వారిలో 12,157 మందికి ఉపాధి లభించిందన్నారు. ఉపాధి పొందిన వారిలో 93 శాతం మంది మహిళలు ఉండటం విశేషమని చెప్పారు. ఏటీయూఎఫ్‌ఎస్ పథకం కింద రాష్ట్రంలోని వస్త్ర పరిశ్రమ యూనిట్లకు రూ.20.69 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుత పత్తి సీజన్‌లో కాటన్‌న్ కార్పొరేషన్‌న్ ఆఫ్ ఇండియా 30 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.1,557 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేసిందని వివరించారు.
సద్వినియోగం చేసుకోవాలి
నగరిలోని పవర్‌లూమ్ యూనిట్లు నవీనీకరణ చెందడం లేదని రాష్ట్ర టెక్స్‌టైల్ కమిషనర్ రేఖారాణి తెలిపారు. అందుకే నగరి నేత నాణ్యత కూడా మెరుగుపడడం లేదన్నారు. చుడీదార్లకు వారు ఇచ్చే కొలతలు కూడా సరిలేవని చెప్పారు. నగరిలోని పవర్‌లూమ్ సర్వీస్ సెంటర్‌ను ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ అండ్ అపారెల్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా ఆధునికీకరించామని, ఈ శిక్షణ కేంద్రాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రీజినల్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్, ఆఫీస్ ఇన్‌చార్జి సుధారాణి, డైరెక్టర్ రవికుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, జాయింట్ డైరెక్టర్ రాజారావు, ఆర్‌డీఓ అనుపమ పాల్గొన్నారు.
వస్త్రాలను పరిశీలిస్తున్న అధికారులు సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర టెక్స్‌టైల్ కమిషనర్
టీఎస్‌ఆర్‌ఎస్ నమోదు తప్పనిసరి
వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తి, పత్తి రాక, వినియోగం, వాణిజ్యం, నిల్వలు తదితర అంశాలపై కచ్చితమైన గణాంకాలు ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఎంతో కీలకమని వృందా మనోహర్ దేశాయ్ తెలిపారు. టీఎస్‌ఆర్‌ఎస్ పోర్టల్‌లో ఒకసారి మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ పోర్టల్‌ను సౌతిండియాలో నగరి నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఈ పోర్టలో యూనిట్ పేరు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్, పానన్ నంబర్, అవసరమైన పత్రాలను సమర్పించిన అనంతరం ప్రతి యూనిట్‌కు శాశ్వత టీయూఐడీ నంబర్ కేటాయిస్తారని, కేంద్ర టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఈ నంబర్ తప్పనిసరని స్పష్టం చేశారు.
వస్త్ర రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉందని వృందా మనోహర్ దేశాయ్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 5.54 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరుగుతోందని, దాదాపు 16 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతోందన్నారు. రాష్ట్రంలో 238 జిన్నింగ్, ప్రెస్సింగ్ యూనిట్లు, 104 స్పిన్నింగ్ మిల్లులు, 25.3 లక్షల స్పిండిల్స్ ఉన్నాయని వివరించారు. దేశంలోనే ముడి పట్టు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రెండో అతిపెద్ద రాష్ట్రంగా ఉందన్నారు. చిత్తూరు జిల్లాలోని నగరి ప్రాంతంలో సుమారు 3,438 యూనిట్లు, 13వేల పవర్‌లూమ్‌లు పనిచేస్తున్నాయని వెల్లడించారు. వీటికి 34 సైజింగ్ యూనిట్లు, 50 డైయింగ్ యూనిట్లు సహకరిస్తున్నాయన్నారు. అయితే పవర్‌లూమ్ యంత్రాలు గానీ, డైయింగ్ యూనిట్లు గానీ అప్‌డేట్ కాలేదని చెప్పారు. అత్యాధునిక పవర్‌లూమ్‌లు ఈ ప్రాంతంలో లేవన్నారు. పాత పద్దతులే పాటించడంతో విద్యుత్. నీరు ఆదా కాదని, నాణ్యతలో కూడా తేడా ఉంటుందని తెలిపారు. నగరిలోని ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ అండ్ అపారెల్ డెవలప్‌మెంట్ సెంటర్ (టీఎస్‌ఆర్‌ఎస్) పవర్‌లూమ్, వస్త్ర రంగ కార్మికులకు అందుబాటులో ఉందన్నారు. ఉత్పత్తి కేంద్రాల్లో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారం, రుణ సదుపాయాలపై మార్గదర్శకత్వం, కార్మికులకు శిక్షణతో పాటు అత్యాధునిక యంత్రాలు, భవిష్యత్ మార్కెట్ డిమాండ్, ఫ్యాషనన్‌్ ట్రెండ్స్‌పై సమాచారం అందిస్తుందని వివరించారు. పవర్‌టెక్స్ ఇండియా పథకం కింద రాష్ట్రంలోని 1,861 మంది చేనేత కార్మికులకు యూనిట్ల ఆధునికీకరణకు సహాయం అందించామని, ప్రధానమంత్రి క్రెడిట్ పథకం కింద మరో 40 మంది చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించామని వెల్లడించారు.


