– రూ.2.22 లక్షల రికవరీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సైబర్ నేరంలో పోగొట్టుకున్న రూ.2,22,054 మొత్తా న్ని రెండు రోజుల్లోనే రికవరీ చేసి బాధితుడికి అందజేశా మని ఎస్పీ తుషార్‌డూడి తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ సోమల గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి చలానా పేరిట వచ్చిన నకిలీ లింక్ ద్వారా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు నుంచి రూ.2.22 లక్షలు డెబిట్ అయ్యాయని తెలిపారు. బాధితుడు అప్రమత్తమై 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడని తెలిపారు. సైబర్ సెల్ పోలీసులు రంగంలోకి దిగి ఆ మొత్తాన్ని ఫ్రీజ్ చేశారని పేర్కొన్నారు. 48 గంటల్లోనే పూర్తి సొమ్మును రికవరీ చేసినట్టు తెలిపారు. సైబర్ మోసం జరిగిన వెంటనే ’గోల్డెన్ అవర్’లో 1930కు కాల్ చేస్తే డబ్బులు దక్కించుకోవచ్చని ఎస్పీ తెలిపారు.
టీబీ, హెచ్‌ఐవీ పరీక్షలు వేగవంతం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని పీహెచ్‌సీల్లో టీబీ, హెచ్‌ఐవీ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని అదనపు డీఎంహెచ్‌ఓ జి.వెంకట ప్రసాద్ ఆదేశించారు. ఆయన గురువారం ల్యాబ్ టెక్నీషియన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీలలో టీబీ పరీక్షలు ఆశించిన రీతిలో జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుమానితులకు ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలతో పాటు గర్భిణులకు విధిగా టీబీ, హెచ్‌ఐవీ పరీక్షలు చేయాలన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ డెంగీ, మలేరియా పాజిటివ్ వస్తే వెంటనే చికిత్స ప్రారంభించాలని, హెచ్1ఎన్1 కేసులను తిరుపతి రుయా ఆస్పత్రికి రెఫర్ చేయాలని సూచించారు. అనంతరం హెచ్‌ఐవీ అవగాహన కర పత్రాలు ఆవిష్కరించారు.
మా డబ్బులు మాకివ్వండి సార్
– ఆర్డీవో కార్యాలయం ఎదుట
ఉద్యోగుల ధర్నా
చిత్తూరు కలెక్టరేట్ : మా డబ్బులు మాకివ్వండి సీఎం సార్ అంటూ ఏపీ జేఏసీ అమరావతి సంఘం జిల్లా చైర్మన్ సయ్యద్ మరూఫ్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి చిత్తూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ మధ్యంతర భృతిని వెంటనే చెల్లించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. వేల కోట్లకు పేరుకుపోయిన డీఏ, 11 వ పీఆర్సీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్, తదితర పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు గత ప్రభుత్వం తగ్గించిన అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించాలన్నారు. డిమాండ్ పరిష్కరించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఆ సంఘం కో చైర్మన్ సుధాకర్, కలెక్టరేట్ అధ్యక్షురాలు సరిత, నాయకులు హేమాద్రిరాజు, సంపత్, అమర్‌నాథ్, రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.


