దుర్గాలమ్మ ఆలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

దుర్గాలమ్మ ఆలయంలో చోరీ

Aug 23 2026 1:46 AM | Updated on Aug 23 2026 1:46 AM

గుడిపాల : మండలంలోని బొమ్మసముద్రంలో ఉన్న దుర్గాలమ్మ ఆలయంలో శుక్రవారం అర్ధ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డా రు. అమ్మవారి బంగారు తాళిబొట్టును దోచుకెళ్లారు. అపహరణకు గురైన ఆభరణం సుమా రు 2 గ్రాములు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు గ్రామానికి వెళ్లి ఘటనాస్థలం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చీటీల పేరుతో మోసం

కుప్పం : చీటీల పేరిట మోసం చేసి తల్లీకుమారుడు పరారైన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. స్థానిక మర్రిమాను వీధిలో ఫయాజ్‌, తల్లి షకిలీ నివసిస్తుండేవారు. వీరు చీటీలు నడుపుతూ చుట్టూ పక్కల వారి నుంచి నగదు వసూలు చేశారు. రెండేళ్లుగా చీటీలతో నష్టపోయామని, తమ ఇంటిని అమ్మి అందరికీ నగదు సెటిల్‌మెంట్‌ చేస్తామని నమ్మించారు. ఈ క్రమంలోనే స్థానిక అమరావతి కాలనీలోని సొంత ఇంటిని అమ్మేసి, మర్రిమాను వీధిలోని అద్దె ఇంటిని ఖాళీ చేసి రెండు రోజులు క్రితం పరారయ్యారు. చీటీలు వేసిన వారికి మొత్తం రూ.1.48కోట్లు ఇవ్వాల్సి ఉందని బాధితులు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.

గుట్కా ప్యాకెట్లు పట్టివేత

గుడిపాల: చిత్తూరు– వేలూరు రోడ్డులోని మద్రాస్‌ క్రాస్‌ వద్ద వాహనాలను శనివారం తనిఖీ చేస్తుండగా కారులో తరలిస్తున్న 31 బ్యాగుల గుట్కా ప్యాకెట్లు పట్టుడినట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌ తెలిపారు. కర్ణాటకు చెందిన డ్రైవ ర్‌ హర్షవర్ధన్‌(26)ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

పిల్లలకు ఆటపాటలతో బోధించాలి

బంగారుపాళెం: అంగన్‌వాడీ కేంద్రాలలో చదువుకునే పిల్లలకు కార్యకర్తలు ఆటపాటలతో బోధన చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ సూచించారు. శనివారం బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అంగన్‌వాడీ వర్కర్లకు ‘జ్ఞానజ్యోతి’ శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతులను సందర్శించిన డీఈవో మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాల్లోని(ప్రీ–స్కూల్‌)పిల్లలకు నాణ్య మైన విద్య, మేధో వికాసం అందించడానికి ప్రభుత్వం జ్ఞానజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ప్రాథమిక విద్యతో పాటు ఆరోగ్యకరమైన సంరక్షణ, ఆటపాటల ద్వారా పిల్లల్లో మానసిక, మేథోపరమైన అభివృద్ధిని పెంపొందించేందుకు జ్ఞానజ్యోతి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement