విద్యార్థులపై ఉపాధ్యాయుడి కులవివక్ష | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై ఉపాధ్యాయుడి కులవివక్ష

Aug 23 2026 1:46 AM | Updated on Aug 23 2026 1:46 AM

తవణంపల్లె(ఐరాల): తవణంపల్లె మండలంలోని అరగొండ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఇటీవల ఆ పాఠశాల ఉపాధ్యాయుడు సునీల్‌కుమార్‌ ప్రార్థన సమయంలో ఎస్సీ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కులం పేరుతో అనుచిత వ్యాఖలు చేశారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై డీఈఓ ఆదేశాల మేరకు డీవైఈఓ ఇంద్రాణి, ఐరాల ఎంఈఓ రుషేంద్రబాబు, తవణంపల్లె ఎంఈవోలు హేమలత, మోహన్‌రెడ్డి, గంగవరం మండలం హెచ్‌ఎంలు బాలచైతన్య, గిరి స్కూల్‌లో శనివారం విచారణ చేపట్టారు. సదరు విద్యార్థులతో కుల వివక్షపై వివరణ కోరగా, విద్యార్థులు విషయాన్ని విచారణ కమిటీ బృందానికి స్పష్టంగా చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులను, హెచ్‌ఎం, సంబంధిత ఉపాధ్యాయులను విచారించారు. విచారించిన అంశాల వివరాలను నివేదికల రూపంలో డీఈవోకు సమర్పించినట్లు డీవైఈఓ ఇంద్రాణి తెలిపారు. ఆమేరకు ఉపాధ్యాయుడు సునీల్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఈవో లక్ష్మీనారాయణ ఉత్తర్వులు జారీచేసినట్టు తవణంపల్లె ఎంఈవో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement