ఏపీపీడీఈఏ కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఏపీపీడీఈఏ కార్యవర్గం ఎన్నిక

Aug 23 2026 1:40 AM | Updated on Aug 23 2026 1:40 AM

చిత్తూరు కార్పొరేషన్‌: ఏపీపీడీఈఏ (ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ డిప్లామా ఇంజినీర్‌ అసోయేషన్‌ ) జిల్లా, డివిజన్‌ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం చిత్తూరులోని విద్యుత్‌శాఖ అతిథిగృహంలో ఎస్పీడిసిఎల్‌ ప్రధాన కార్యదర్శి నాగరాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా విజయభాస్కర్‌ రెడ్డి (ఏఈ, హెచ్‌టీ మీటర్స్‌, చిత్తూరు), కార్యదర్శిగా వివేకానందరెడ్డి (ఏఈ,గిరింపేట, చిత్తూరు), కార్యనిర్వహక కార్యదర్శిగా హేమచంద్రుడు(ఏఈ, రూరల్‌, బంగారుపాళ్యం), కోశాధికారిగా రాజా(ఏఈ, నిర్మాణవిభాగం, చిత్తూరు), మహిళ కార్యనిర్వహక కార్యదర్శిగా నీరజ(ఇన్‌చార్జి ఏఈ, ఐరాల) ఎన్నికయ్యారు. అలాగే చిత్తూరు అర్బన్‌ డివిజన్‌ కార్యదర్శిగా పురుషోత్తం(ఏఈ, కల్లూరు) కార్యనిర్వహక కార్యదర్శిగా హేమచంద్రారెడ్డి(ఏఈ,ట్రాన్స్‌ఫార్మర్స్‌ చిత్తూరు), కోశాధికారిగా ప్రకాష్‌రెడ్డి(జేఈ, కల్లూరు) ఏకగ్రీవమయ్యారు. చిత్తూరు రూరల్‌ డివిజన్‌ కార్యదర్శిగా బాలచంద్ర(ఏఈ, నగరి), కార్యనిర్వహక కార్యదర్శిగా తులసీప్రసాద్‌(ఇన్‌చార్జి ఏఈ, పెనుమూరు), కోశాధికారిగా లోకేశ్వర్‌రెడ్డి(ఏఈ, పాలసముద్రం) ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement