చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. 2025 జనవరి ఓటర్ల జాబితా ప్రామాణికంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పర్యవేక్షణ బాధ్యతలను ఆయా మండలాల ఎంపీడీఓలకు అప్పగించారు. జిల్లాలో 5,906 పోలింగ్ కేంద్రాలను ప్రాథమికంగా గుర్తించినప్పటికీ, ఓటర్ల జాబితా మేరకు అదనంగా ఎక్కడైనా అవసరమా? విభజన చేయాల్సి ఉందా? మార్పులకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాలని ఎంపీడీఓలకు ఉన్నతాధికారులు సూచించారు.
ఇంటింటి సర్వే
ప్రస్తుతం గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాల సేకరణకు ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి ఈనెల 25వ తేదీన డ్రాఫ్ట్ జాబితాను ప్రచురించాలి. 28 వరకు అభ్యంతరాలు స్వీకరించి, సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించాల్సి ఉంది. సామాజిక వర్గాలవారీ అదే నెల 7వ తేదీన తుది జాబితాను ప్రచురిస్తారు. వీటి ఆధారంగా రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశముంది.
వైద్య ఆరోగ్య శాఖలో
సమ్మె సైరన్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య ఆరో గ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పోరుబాటకు సంబంధించి శనివారం డీఎంహెచ్‌ఓ నాగశశిభూషణ్‌రెడ్డికి నోటీసు అందజేశారు. గతంలో ఇచ్చిన 45 రోజుల గడువు ముగిసినా సర్కార్ నుంచి స్పందన లేకపోవడంతోనే ఉద్యమానికి దిగినట్లు జేఏసీ నేతలు తెలిపారు. సోమవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని, వినతిపత్రాల ను అందిస్తామని వెల్లడించారు. ఈనెల 28,29 తేదిల్లో భోజన విరామ సమయంలో భారీ మాన వ హారాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తర్వాత సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. నేతలు నరే ష్,నవాజ్, ఈశ్వర్‌రెడ్డి, ధరణి, గీతా పాల్గొన్నారు.
ఓటర్లకు ఫారమ్–8 తిప్పలు
చిత్తూరు కలెక్టరేట్ : ఓటర్ల జాబితాలో చిరునామా మార్పులు, సవరణలకు సంబంధించి ఫారమ్–8 దరఖాస్తులు చేయించడంలో కొందరు బీఎల్‌ఓ లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లకు సహకారం అందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆన్‌న్‌లైన్, ఆఫ్‌లైన్‌న్‌లో ఫారమ్–8 దరఖాస్తు ప్రక్రియ తెలి యని ఓటర్లకు సహాయం చేయాల్సిన బీఎల్‌ఓలు ఈ పని తమది కాదంటూ కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులకు వెళ్లాలని చెబుతున్నారు. బీఎల్‌ఓల మాట విని ఓటర్లు ఆఫీసుల వద్దకు వెళితే ఇక్కడికి ఎందుకు వచ్చారు, బీఎల్‌ఓ ద్వారానే ఫారమ్–8 నమోదు చేయించుకోవాలి అని అక్కడి అధికారు లు తిప్పి పంపుతున్నారు. దీంతో ఓటర్లకు తిప్ప లు తప్పడం లేదు. స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న సమయంలో అయినా బీఎల్‌ఓలు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ఈఆర్‌ఓలు చర్య లు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


