భవన నిర్మాణ దరఖాస్తులపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

భవన నిర్మాణ దరఖాస్తులపై సమీక్ష

Aug 23 2026 1:40 AM | Updated on Aug 23 2026 1:40 AM

చిత్తూరు అర్బన్‌: నగరపాలక పరిధిలో భవన నిర్మాణాలకు సంబంధించి దరఖాస్తులపై డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ బి.శ్రీనివాసులు సమీక్షించారు. శనివారం చిత్తూరు నగరంలోని నగరపాలక కార్యాలయంలో కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌తో కలిసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లోని లేఔట్‌ రెగ్యులేషన్‌, ఇన్‌ ప్రిన్సిపల్‌ లేఅవుట్‌ పాటర్న్‌ దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ సంబంధించి 411, ఐపీఎల్‌పీఎస్‌ సంబంధించి 151 దరఖాస్తులపై సమీక్షించారు. పెండింగ్‌ దరఖాస్తులను ఈ నెలాఖరులాగా పూర్తి చేయాలని ఆదేశించారు. అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ నాగేంద్ర, సుభప్రధ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement