ఆప్షన్‌–3కి అడ్డంకులు | - | Sakshi
Sakshi News home page

ఆప్షన్‌–3కి అడ్డంకులు

Aug 19 2026 12:24 AM | Updated on Aug 19 2026 12:24 AM

● పేదల ఇళ్లకు సాంకేతిక గ్రహణం ● ఆగిపోయిన ఆప్షన్‌–3 గృహాల నిర్మాణం

పోలీసులు సీజ్‌ చేసిన లారీ

చిత్తూరు కలెక్టరేట్‌ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్పర్శ్‌ విధానంతో ఆప్షన్‌్‌–3 పక్కా ఇళ్లకి సాంకేతిక గ్రహణం పట్టింది. జగనన్న కాలనీల్లో ఇల్లు కట్టుకునే అవకాశం లేని వారికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే నిర్మించి ఇచ్చేందుకు లబ్ధిదారుల కు మూడో ఆప్షన్‌ను కేటాయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున చెల్లించేందు కు చర్యలు చేపట్టింది. అందులో పట్టణ ప్రాంతమైతే మొత్తాన్ని ప్రభుత్వమే ఇవ్వగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 వేలను ఉపాధిహామీ పథకం కింద చెల్లించేలా ప్రతిపాదించింది. స్వయం సహాయక సంఘాల మహిళలకు అదనంగా వడ్డీ లేని రుణం కింద రూ.35 వేలు మంజూరు చేసింది. దీంతో యూనిట్‌కి రూ.2.15 లక్షల నగదును ఇంటి నిర్మా ణ దశల వారీగా లబ్ధిదారుల ఖాతాకు జమ చేసేలా కార్యాచరణ అమలు చేసింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆప్షన్‌–3 లక్ష్యాలను పూర్తిగా నీరుగారుస్తోంది.

జిల్లాలో 1,225 గృహాలు

ఆప్షన్‌–3లో జిల్లాలోని 1,225 గృహాల నిర్మాణ పనులను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏజెన్సీ (కాంట్రాక్టర్‌)లకు అప్పగించింది. అందులో 326 గృహాలు పూర్తయిన తర్వాత చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చింది. దీంతో మిగిలిన ఇళ్లు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. పేరుకు అన్నీ పలు దశల్లో ఉన్నట్లు చూపించినా అందులో ఎక్కువ ఇళ్లు పునాదుల్లోనే ఉన్నాయి. కొన్ని శ్లాబ్‌ పూర్తయి, గోడలకు ప్లాస్టింగ్‌, తలుపులు, కిటికీలు అసంపూర్తిగా మిగిలాయి.

లబ్ధిదారులు ముందుకు వస్తేనే..

స్పర్శ్‌ విధానంలో ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నగదు నేరుగా లబ్ధిదారుల ఆధార్‌ అనుసంధాన బ్యాంకు ఖాతాకే బదిలీ కావాలనేది ని బంధన. కాంట్రాక్టర్‌లు నిర్మించడానికి ముందుకొచ్చి నా వారికి నగదు ఇప్పించడం అధికారులకు తలనొప్పి గా మారనుంది. దీంతో బిల్లులు రావనే భావ నతో కాంట్రాక్టర్‌లు నిర్మాణ పనులను అన్ని చోట్లా ఆపేశా రు. అసంపూర్తి ఇళ్ల నిర్మాణానికి ఎంత మంది లబ్ధిదారులు ముందుకొస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement