చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు వంద శాతం పూర్తి చేయాలని డీఎంహెచ్‌ఓ నాగ శశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ పీహెచ్‌సీల వారీగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను 100 శాతం పూర్తి చేయాలన్నారు. సంజీవిని, కేసీఆర్ అప్డేట్స్‌ను ఈ నెల 30లోగా, ఈఎస్‌ఆర్ డిజిటలైజేషన్‌ను సెప్టెంబర్ 1 నాటికి పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా కుప్పంలో అప్డేట్స్ వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఎన్ సీడీ స్క్రీనింగ్‌లో 90శాతం లక్ష్యం సాధించాలని, బీపీ, షుగర్ ఫాలోఅప్ పెండింగ్ జాబితా సమర్పించాలని స్పష్టం చేశారు. ఏఎన్‌ఎంలు ఆరోగ్యశ్రీ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చేయాలన్నారు. అదనపు డీఎంహెచ్‌ఓ వెంకట ప్రసాద్, డాక్టర్లు అనిల్ కుమార్, ప్రవీణ, గిరి పాల్గొన్నారు.
‘హిందాల్కో’కు
60 ఎకరాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని కుప్పం మండలం ఏకార్లపల్లెలో హిందాల్కో ప్రాజెక్ట్‌కు 60 ఎకరాల భూమి కేటాయిస్తున్నట్లు కేబినెట్‌లో మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఏకార్లపల్లెలో అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ (విస్తరణ) ప్రాజెక్ట్ ఏర్పాటు నిమిత్తం ప్రముఖ పారిశ్రామిక సంస్థ మెస్సర్స్ హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు 60 ఎకరాలను కేటాయిస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల పరిధిలోని హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–2 మిగిలిన పనులను వేగవంతం చేసేందుకు రూ.1,323.75 కోట్ల అంచనా వ్యయానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇందులో అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలోని నీవా బ్రాంచ్ కెనాల్ పనుల కోసం రూ.573.68 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది.


