– పౌల్ట్రీ రైతుల ఆందోళన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కోళ్లకు నకిలీ మేత సరఫరా చేస్తుండడంపై పౌల్ట్రీ రైతులు నిరసన తెలిపారు. మంగళవారం చిత్తూరులోని దాణా కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. కోళ్ల రైతులు సుధాకర్ రెడ్డి, శ్రీపతి మాట్లాడుతూ నకిలీ మేత కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రామాణికం లేని మేతను సరఫరా చేయడంతో నిత్యం వందలాది కోళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయని, కంపెనీ ప్రతినిధుల బాధ్యతారాహిత్యంతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. దాదాపు 120 రోజుల వయసు, సుమారు 2 కేజీల బరువు ఉన్న కోళ్లకు కొన్ని రోజులుగా ఎస్‌కేఎం కంపెనీ(తమిళనాడులోని ఈ రోడ్) ఫీడ్ వా డామన్నా. అయితే, మేత వాడకం ప్రారంభించిన పది రోజుల నుంచే కోళ్లలో అనారోగ్య సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. కోళ్లలో జీర్ణకోశ, లివర్ వ్యాధులు రావడం, పేగుల్లో పుండ్లు పడటం వల్ల బరువు తగ్గిపోయి హఠాత్తుగా చనిపోతున్నాయని వాపోయారు. ప్రతిరోజూ వందలాది కోళ్లు ప్రాణా లు కోల్పోతుండటంతో రూ.లక్షల్లో నష్టం వాటి ల్లుతోందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోళ్ల మరణాల సంఖ్య పెరగడంతో కంపెనీ మార్కెటింగ్ మేనేజర్‌కు తక్షణమే ఫిర్యాదు చేశామన్నారు. అయితే, మూడు రోజుల ఆలస్యంగా వచ్చిన కంపెనీ ప్రతినిధి, కేవలం ఫొటోలు తీసుకుని వెళ్లడం మినహా నష్టపరిహారం లేదా ప్రత్యామ్నాయ చర్యలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ యాజమాన్యం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించకపోతే అధికారులకు లీగల్‌గా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. నకిలీ దాణా సరఫరా చేస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోళ్ల కంపెనీ మేనేజర్ గిరిబాబుతో పాటు రైతులు వి.రమేష్ నాయుడు, స్వామినాథన్, దేవేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, రామచంద్ర శెట్టి, లోకనాథరెడ్డి, చిన్నబ్బారెడ్డి పాల్గొన్నారు.


