మావిగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

మావిగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

అమరావతి పేరిట అతిపెద్ద స్కామ్‌ మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

పాలసముద్రం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌ ద్వారానే రాష్ట్ర భవిష్యత్‌కు మంచి మార్గం ఉంటుందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. ప్రస్తుతం అమరావతి రాజధాని పేరిట దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ జరుగుతోందని విమర్శలు ఎక్కుపెట్టారు. శుక్రవారం పాలసముద్రంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ శ్రేణులు అమరావతి పేరుతో సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. కడపలో ఉక్క కార్మాగారం, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్రత్యేక ప్రతిపత్తి వంటి హామీల గురించి ఎప్పడైన ప్రశ్నించారా..? అని నిలదీశారు. ఆమరావతిని రాజధానిగా ప్రకటించడం వల్ల ప్రజలకు పెద్దగా లాభం కలగలేదన్నారు. నాగులు గ్రామాల పరిధిలో లక్ష ఎకరాల భూసేకరణకు ప్రయత్నించడం సమంజనం కాదన్నారు. దాని అభివృద్ధికి సుమారు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఇది సాధ్యమయ్యే అంశమా..? అని ప్రశ్నించారు. 175 నియోజకవర్గాల ప్రజలపై భారీ అప్పులు మోపి ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌ సీపీ ప్రతిపాదిస్తున్న మావిగన్‌ మోడల్‌నే రాష్ట్ర భవిష్యత్‌కు అనుకూలమని వివరించారు. ఏబీఎస్‌ రాధాక్రిష్ణ మాటలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని, ఇలాంటి నీచ, నికృష్ట భాష వాడిన బూతుల కిట్టుకి మహిళలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జెడ్పీటీసీ సభ్యుడు అన్బ్‌లగన్‌, మాజీ మండల కన్వీనర్‌ సుందరరాజు, షణ్ముగరెడ్డి, నరసింహనాయుడు, మదివానన్‌, వేణు, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement