పరిపూర్ణం.. వసంతోత్సవం | - | Sakshi
Sakshi News home page

పరిపూర్ణం.. వసంతోత్సవం

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

కార్వేటినగరం: కార్వేటినగరంలోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం వార్షిక వసంతోత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. వేద పండితులు వేకువ జామున సుప్రభాత సేవతో స్వామివార్లను మేల్కొల్పి నిత్యకై ంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, చందనం, పసుపు, తేనె, నారికేళం వంటి సుగంధ జలాలతో స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు స్వామివారికి ఆస్థానం నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామివారు.. ఆదే విధంగా సీతాసమేత కోదండరాముడు తిరుచ్చి వాహనలపై కొలువు దీర్చారు. మంగళ వాయి ద్యాల నడుమ గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ సూపరింటెండెంట్‌ మునిశేఖర్‌ఽ, ఆలయ అధికారి చెంగల్‌రాయులు, అర్చకులు శభరి, గోపాలాచారి పాల్గొన్నారు .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement