కాదు..కూడదంటే.. | - | Sakshi
Sakshi News home page

కాదు..కూడదంటే..

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

న్యూస్‌రీల్‌

అమరావతి పేరిట అతిపెద్ద స్కామ్‌ మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

చెప్పింది చేయలేదని అధికారులపై జులుం

ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి పక్కనబెట్టిస్తున్న వైనం

రేణిగుంట, ఏర్పేడు తహసీల్దార్లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధింపులు

మూడు రోజులైనా ఆ స్థానాలు ఖాళీ

తాజాగా తొట్టంబేడు మండలంలో ముగ్గురు రెవెన్యూ అధికారుల బదిలీ

హడలిపోతున్న అన్ని శాఖల అధికారులు

శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

సీనియారిటీ జాబితా విడుదల

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు శుక్రవారం డీఈవో రాజేంద్రప్రసాద్‌ విలేకరులతో మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు ఎస్‌జీటీ కేడర్‌ టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్‌లుగా ఉద్యోగోన్నతులు కల్పించే ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పనిచేస్తున్న అర్హులైన టీచర్ల ప్రొవిజనల్‌ సీనియారిటీ జాబితాను ఠీఠీఠీ.ఛిజిజీ్‌ౌట్‌ౌటటఛీ్ఛౌ.ఛిౌఝ వెబ్‌సైట్‌లో పొందుపరిచారన్నారు. ఈ జాబితాను ఆయా మండలాల ఎంఈవో, డీవైఈవో మెయిల్స్‌కు పంపినట్టు వెల్లడించారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో ఏవైనా అభ్యంతరాలున్నట్‌లైతే ఈ నెల 11 నుంచి 16వ తేదీలోపు డీఈవో కార్యాలయంలో సరైన ఆధారాలతో అందజేయాలన్నారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించేది లేదని డీఈఓ స్పష్టం చేశారు.

మసీదులకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని మసీదులకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి చిన్నారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని మసీదుల నిర్వహణ కమిటీలు, గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్‌, మౌజన్‌ లు తమ మసీదుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉమీద్‌ పోర్టల్‌లో మసీదుల వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. మసీదు మేనేజింగ్‌ కమిటీలు తమ మసీదుకు సంబంధించిన ల్యాండ్‌ డాక్యుమెంట్‌లతో కలెక్టరేట్‌లోని జిల్లా వక్ఫ్‌బోర్డ్‌ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ నెల 25వ తేదీ లోపు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా ఉమీద్‌ పోర్టల్‌లో రిజి స్ట్రేషన్‌ పూర్తి చేయని మసీదులకు సంబంధించిన ఇమామ్‌లు, మౌజన్లకు ప్రస్తుతం అందుతున్న గౌరవ వేతనాన్ని రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

13న ఐటీఐలో అప్రెంటీస్‌ మేళా

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 13న అప్రెంటీస్‌షిప్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ రవీంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం 9 నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో శిక్షణ పూర్తి చేసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాల్గొనేందుకు అర్హులన్నారు. హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట ఒరిజనల్‌ విద్యార్హత సర్టిఫికెట్‌లు తీసుకురావాలన్నారు. పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్న వారు సంబంధిత వివరాలతో, నమోదు చేసుకోని వారు తమ సర్టిఫికెట్‌లతో నేరుగా వచ్చి రిజిస్టర్‌ చేసుకోవచ్చన్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నిబంధనలతో మీకు పనిలేదు. మేం చెప్పింది చెయ్యి.. అంతా మేం చూసుకుంటాం..’ అంటూ కూటమి నేతలు అధికారులను ఉసిగొల్పుతున్నారు. తమకు కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారు. మాట వినని వారిపై ని ఘా పెడుతున్నారు. పైఅధికారులపై ఒత్తిడి తెచ్చి వారి విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. కాదు.. కూడదంటే ఉద్యోగమే లేకుండా చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో తమ పలుకబడి ఉపయోగించి సంబంధిత అధికారుల నుంచి ఒత్తిడి చేయిస్తున్నారు. ఆపై ఉద్యోగమే లేకుండా.. ఎక్కడా పోస్టింగే ఇవ్వకుండా పక్కన బెట్టేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. తాము చెప్పిన పనులు చేయడం లేదని తిరుపతి జిల్లాలోని రేణిగుంట, ఏర్పేడు తహసీల్దార్లను పక్కనబెట్టేశారు. మూడు రోజులవుతున్నా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఆ స్థానంలో వేరొకరికి బాధ్యతలు అప్పగించకుండా చోద్యం చూస్తున్నారు. అదే నియోజకవర్గంలో మండల నాయకుడి మాట వినడం లేదని తొట్టంబేడు తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసే ముగ్గురు రెవెన్యూ అధికారులను కేవీబీ పురం మండలానికి బదిలీ చేశారు. అలాగే చిత్తూరు జిల్లా పలమనేరులోనూ ఇలాంటిదే చోటు చేసుకుంది.

మూడు రోజులైనా..?

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో మూడు రోజులుగా రేణిగుంట, ఏర్పేడు తహసీల్దార్లు కార్యాలయానికి రావడం లేదు. వారిని బదిలీ చేశారా? లేదా? కూడా తెలియడం లేదు. పోనీ ఆ స్థానంలోకి వేరొక అధికారి వచ్చారా? అంటే అదీ లేదు. జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యమైన మండలాల్లో రేణిగుంట, ఏర్పేడు ప్రధానమైనవి. రెవెన్యూతో పాటు.. ప్రొటోకాల్‌ వ్యవహరాలు అధికంగా ఉంటాయి. అటువంటి మండలాల్లో మూడు రోజులుగా తహసీల్దార్లు లేరు. ఉన్న ఇద్దరు అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధి చెప్పిన పని చేయలేదని ఆగ్రహానికి లోనైనట్టు సమాచారం. ఆ ఇద్దరు తహసీల్దార్లను బదిలీ చేయమని ఉన్నతాధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఆ ప్రజాప్రతినిధి చెప్పినట్టు వినకపోతే ఎక్కడ అమరావతి నుంచి ‘ముఖ్య’ నేతల నుంచి తిట్టిస్తారోనని భయపడి ఉన్నతాధికారి ఆ ఇద్దరు తహసీల్దార్లకు సమచారం ఇచ్చారు.

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వ అధి కారులు హడలిపోతున్నారు. కూటమి నే తల బెదిరింపులు, వేధింపులతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇప్పటిదాకా అవినీతి మరక అంటని వారు తెలిసితెలి సి తప్పులు చేయలేక.. అధికార పార్టీ నేత ల బూతు పురాణం వినలేక.. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక కుమిలిపోతున్నారు. తీరా కష్టపడి సంపాదించిన పేరు ప్రతిష్టలు పోగా.. ఉద్యో గమూ లేకుండా పక్కన బెట్టేయడం చూసి ఆవేదనకు లోనవుతున్నారు. ఇంతబతుకు బతికీ.. తీరా ఇలా చేస్తారని అనుకోలేదని తమ సన్నిహితుల వద్ద చెప్పుకుని కన్నీళ్లు పెడుతున్నారు. ఇంతకీ ఏమిటా కథా.. ఎందుకంత ఆవేదన.. మీరే చదవండి!

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూటమి నేతల కర్ర పెత్తనం

ఇన్‌చార్జ్‌ కనుసన్నల్లోనే అధికారులు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు నడుచుకోకపోతే ఏ అధికారి ఉద్యోగం చేయలేని దుస్థితి. పలమనేరు నియోజకవర్గంలో ప్రతి మండలాని కి ఒకరు టీడీపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ ఇన్‌చార్జ్‌కి తెలియకుండా ఏ ఒక్క ఫైలు కదలడానికి వీల్లేదు. రెవెన్యూ అప్పీళ్లపైనా ఆ ఇన్‌చార్జ్‌ చెప్పినట్లు అధికారులు నడుచుకోవాలి. లేదంటే, ఆ అధికారి అక్కడ పనిచేయలేరు. నెల క్రితం తవణంపల్లె తహసీల్దార్‌ను నిర్ధాక్షి ణ్యంగా బదిలీ చేయడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement