● అవగాహన, ప్రతిస్పందన విభాగంలో అడిగే ప్రశ్నలకు పూర్తి వాక్యాలలో జవాబులు రాయాలి.
● పద్యభాగం, గద్య భాగం, ఉపవాచకాల నుంచి వచ్చే లఘు, వ్యాస రూప సమాధాన, సృజనాత్మక ప్రశ్నలకు వాటి స్వభావం మేరకు తగిన విధంగా జవాబులు స్పష్టంగా రాయాలి.
● భాషాంశాలకై పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠం చివర ఉన్న అభ్యాసాలు, పుస్తకం చివరలోని పదవిజ్ఞానం, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్యర్థాలు, ప్రకృతి–వికృతి పదాలను అవలోకనం చేసుకోవాలి.
● బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు అ, ఆ, ఇ, ఈ ఐచ్ఛికాలలో సమాధానాన్ని గుర్తించడంతో పాటు సంబంధిత పదాలు కూడా రాయాలి.
● చక్కని దస్తూరీతో పాటు విరామ చిహ్నాలు పాటిస్తూ, అక్షర దోషాలు లేకుండా చూపుకోవాలి
– చండ్ర నరేష్, తెలుగు ఉపాధ్యాయుడు


