● మొదట 8 మార్కుల ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నలు, తర్వాత 2 మార్కుల, 1 మార్కు ప్రశ్నలు స్పష్టంగా రాయాలి
● 8 మార్కుల ప్రశ్నలు రాసేందుకు బ్లూప్రింట్ పరంగా ముఖ్యంగా మానవుడి కన్ను, రంగుల ప్రపంచం, రసాయనిక చర్యలు, సమీకరణలు, విద్యుత్తు ప్రవాహం, అయస్కాంత ఫలితం, విద్యుత్, కార్బన్ సమ్మేళనాలు, లోహాలు, ఆలోహాలు పాఠాలను క్షుణ్ణంగా చదవాలి
● 4 మార్కుల ప్రశ్నలకు ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, కాంతి పరావర్తనం చదవాలి. వీటి నుంచే చిత్రపటాలు, రేఖా చిత్రాలు వస్తాయి
● అలాగే ఎఫ్‌ఏ పరీక్షలు,, ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్టు ప్రశ్నపత్రాలను సేకరించి సన్నద్ధం కావాలి.
– గంటామోహన్, స్కూల్ అసిస్టెంట్


