ప్రణాళికతో పదిలం | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో పదిలం

Mar 13 2026 7:57 AM | Updated on Mar 13 2026 7:57 AM

16 నుంచి పదో తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 219 కేంద్రాలు హాజరుకానున్న 21,051 మంది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించేందుకు సబ్జెక్టు నిపుణుల సూచనలు

ఇంగ్లిష్‌ ఇలా..

● జవాబు రాసేప్పుడు ఆర్డర్‌ మిస్‌ కాకూడదు

● లెసెన్‌ చివరలో ఉండే టెక్స్‌వల్‌ గ్రామర్‌ను బాగా ప్రాక్టీస్‌ చేయాలి

● స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ లేకుండా చూసుకోవాలి.

● క్రియేటివ్‌ రైటింగ్‌లో మాగ్జిమమ్‌ మార్కులు స్కోర్‌ చేయడానికి 2 పేజీలకు తక్కువ లేకుండా ఆన్సర్లు రాయాలి

– జయంతి, స్కూల్‌ అసిస్టెంట్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : విద్యార్థుల భవిష్యత్‌కు పదో తరగతి ఫలితాలే తొలిమెట్టు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సబ్జెక్టు ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్న క్రమంలో ఒత్తిడిని అధిగమించి ప్రణాళిక బద్ధంగా చదివితే పరీక్షలను చక్కగా రాసి ఉత్తమ మార్కులు సాధించవచ్చని సూచిస్తున్నారు.

విద్యార్థి జీవితంలో పదోతరగతి అత్యంత కీలకమని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇక్కడ

సాధించిన ఫలితాలే భవితకు దిశానిర్దేశం చేస్తాయని సూచిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలు ప్రణాళికాబద్ధంగా పరీక్షలు సన్నద్ధం కావాలని వెల్లడిస్తున్నారు. ప్రధానంగా ఒత్తిడిని జయిస్తే ఉత్తమ మార్కులు సాధించవచ్చని వివరిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా చదివితే ఉన్నతంగా రాణించవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు సబ్జెక్టుల వారిగా సలహాలు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement