పెళ్లి చేసుకోమన్నందుకే హత్య! | - | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!

Jan 10 2026 8:15 AM | Updated on Jan 10 2026 8:15 AM

పెళ్ల

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!

– IIలో

– IIలో

న్యూస్‌రీల్‌

పెళ్లి చేసుకోమన్నందుకే దివ్యాంగురాలు కవితను ప్రియుడు గణేష్‌ దారుణంగా హత్య చేసినట్టు తేలింది.

శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026

పలమనేరు: లైవ్‌స్టాక్‌ టెస్ట్‌లు చేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్‌

మామిడి రైతులను

ఆదుకోండి బాబూ!

పాలసముద్రం: చంద్రబాబు ప్రభుత్వంలో మామిడి రైతులు సర్వనాశ నం అయ్యారని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మామిడి రైతు లను ఆదుకుంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి, ఆయ న తనయుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డేనని గుర్తుచేశారు. శుక్ర వారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడా రు. గత ప్రభుత్వంలో మా మిడి రైతులకు కిలో కు రూ.30 దాకా ఇచ్చా రన్నారు. ఇప్పుడు రూ.8 కూడా ఇవ్వడం లేద ని మండిపడ్డారు. మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలేక నష్టాలపాలవుతున్నారని వాపోయా రు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం పునరాలోచించి వచ్చే సీజన్‌లోనైనా మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సూక్ష్మ సాగునీటిలో

ఆటోమేషన్‌కు రాయితీ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): సూక్ష్మ సాగునీటి వ్యవస్థలో ఆటోమేషన్‌ అందజేతకు ప్రభు త్వం రాయితీ ఇస్తోందని ఏపీఎంఐపీ డీడీ రమణ తెలిపారు. చిత్తూరులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సూక్ష్మ సాగునీటి వ్యవస్థలో ప్రభుత్వం ఆటోమేషన్‌ను ప్రోత్సాహిస్తోందన్నారు. ఆటోమేషన్‌ టెక్నాలజీతో నీటివృధాను అరికట్టవచ్చన్నారు. పంట ఉత్పాదకతను పెంచవచ్చని చెప్పారు. ఎక్కడ నుంచి అయినా నీటి పారు దల వ్యవస్థను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఆటోమేషన్‌ కోసం హెక్టారుకు రూ.40 వేలు ఖర్చవుతుందన్నారు. ఇందుకు ప్రభు త్వం రూ.22 వేలు రాయితీగా అందిస్తోందని గుర్తుచేశారు. ఆసక్తిగల రైతులు తమను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.

12న ఐటీఐలో

అప్రెంటీస్‌ మేళా

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 12న అప్రెంటీస్‌ మేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్‌ రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రముఖ కంపెనీల్లో అప్రెంటీస్‌షిప్‌ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రధానమంత్రి నేషనల్‌ అప్రెంటీస్‌ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో శిక్షణ పూర్తి చేసి ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్‌లతో హాజరుకావొచ్చన్నారు. ఇతర వివరాలకు 9676486678 నంబర్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు.

విద్యుత్‌ సమస్యలు పరిష్కారం

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 251 సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల పరంగా 26, ఎల్‌టీ లైన్ల పరంగా 339, సర్వీసు లైన్‌ పరంగా 22 కలిపి మొత్తం 638 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్‌ తెలిపారు. వాటిలో 63 సమస్యలను పరిష్కారించినట్టు ఆయన వెల్లడించారు.

రైతుకు అగ్ని పరీక్ష!

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చంద్రబాబుకు మొదటి నుంచీ రైత న్నలంటే చులకనే. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చి నా వ్యవసాయాన్ని, రైతులను చిన్నచూపు చూస్తుంటారు. ఈ సారీ అదే జరుగు తోంది. అన్నదాతలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటికితోడు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.కోట్లు వెచ్చించి రైతన్న సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అగ్రి టెస్ట్‌ ల్యాబ్‌లను నిర్వీర్యం చేస్తోంది. ఉపయోగంలో ఉన్నవాటినీ నిరుపయోగంగా మార్చే డం విమర్శలకు తావిస్తోంది.

జిల్లాలో నగరి, పలమనేరు, పూతలపట్టు, పెనుమూరు, సోమల ప్రాంతాల్లో గత ప్రభుత్వం అగ్రి ల్యాబ్‌లు నిర్మించింది. ఒక్కో ల్యాబ్‌ నిర్మాణానికి, వసతులకు రూ.కోటికిపైగా ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాకు రూ.11కోట్ల వరకు మంజూరైంది. తద్వారా నగరి, పలమనేరు లో ల్యాబ్‌లు ప్రారంభానికి నోచుకుని పరీక్షలు చేస్తున్నాయి. మట్టి నమూనాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పరీక్షలతో పాటు పశుసంవర్థక శాఖ అభివృద్ధిలో భాగంగా అందుకు సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. రైతులకు నాడు ఎంతో మేలు చేసిన అగ్రి టెస్ట్‌ ల్యాబ్‌లు నేడు నిర్వీర్యమయ్యాయి. పాలకుల నిర్లక్ష్యం, కక్ష సాధింపులతో ఇవి ఎందుకూ పనికిరానివాటిగా మార్చేశారు. ఆయా ల్యాబ్‌లకు చెందిన కోట్ల విలువ చేసే భవనాలు, పరికరాలు నిరుపయోగంగా మారుతున్నాయి.

అ‘లక్ష్యం’!

ఎంతో ఉన్నత లక్ష్యం, ఆశయంతో గత వైఎస్సార్‌సీ పీ ప్రభుత్వం రైతన్న సంక్షేమం కోసం రూ.కోటి ఖర్చు పెట్టి అగ్రిటెస్ట్‌ ల్యాబ్‌లు నిర్మించింది. కల్తీ నివారణే లక్ష్యంగా అడుగులు వేసింది. విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించిన తర్వాత సాగుచేస్తే మేలైన దిగుబడులు సాధించే వీలుంటుందనే ఉద్దేశంతో అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లను నిర్మించింది. సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలతో భవన నిర్మాణాలు, రూ.40 లక్షలతో వివిధ రకాల పరికరాలు, రసాయనాలు, కంప్యూటరైజ్డ్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. పలమనేరు, నగరిలోని ల్యాబ్‌లో వందల సంఖ్యలో పరీక్షల నమూనాలు వచ్చేవి. ఆయా నియోజకవర్గాల్లోని మండలాల రైతన్నలకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. అయితే చంద్రబాబు సర్కార్‌ వచ్చిన తర్వాత ఈ ల్యాబ్‌లు నిర్వీర్యమవుతున్నాయి. పరీ క్ష నమూనాలు రావడమే కష్టంగా మారింది. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు కరు వవుతున్నారు.

సీజన్‌ల వారీగా

సాగు విస్తీర్ణం

ఈఏడాది ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం 80 వేల హెక్టా ర్లు కాగా, సాగు విస్తీర్ణం 30వేల హెక్టార్ల వరకు ఉంటోంది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 24వేల హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 6వేల హెక్టార్లకుపైగా పంటలు సాగులో ఉన్నాయి. వరి సాధారణ విస్తీర్ణం 6,359 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకూ అత్యధికంగా 2 హెక్టార్లలో సాగుచేశారు. గతంలో సీజన్‌వారీగా పంట పండించే రైతులు అగ్రి టెస్ట్‌ ల్యాబ్‌లను ఉపయోగించి.. పరీక్షించుకు నేవారు. ఇలా ఏటా నగరి, పలమనేరు నుంచి 1000కిపైగా పరీక్షలు జరిగేవి. ఇప్పుడు 200 దాటడం కష్టంగా ఉంది.

విత్తన వ్యాపారులకే పరిమితం

నగరి: ల్యాబ్‌ సమీపంలో పడి ఉన్న ఖాళీ మద్యం సీసాలు

నగరి: ల్యాబ్‌లో విత్తన పరీక్ష చేస్తున్న సిబ్బంది

నగరి: అగ్రి టెస్ట్‌ ల్యాబ్‌కు వెళ్లే దారి

పలమనేరు: నియోజకవర్గ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌

గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

మార్షల్‌ ఆర్ట్స్‌ విద్యార్థులకు అభినందనలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జాతీయ అండర్‌ 11, 14 స్థాయిల్లో మార్షల్‌ ఆర్ట్స్‌లో రాణించిన విద్యార్థులను కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ అభినందించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో అభినందన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఇదే స్ఫూర్తితో మరిన్ని పోటీల్లో రాణించాలన్నారు. కోచ్‌లు మన్సూర్‌, ఉమర్‌ మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్‌లో 26వ స్క్వే క్రీడా మార్షల్‌ ఆర్ట్స్‌ అంతర్జాతీయ పోటీలు నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో చిత్తూరు నగరంలోని జైహింద్‌ ఉర్దూ పాఠశా ల విద్యార్థులు ప్రతిభచాటారన్నారు. సాయి శ్రవంతి, మహమ్మద్‌ నూరాజ్‌, మహమ్మద్‌ ముస్తకీమ్‌ బంగారు పతకాలు, అభిలాష్‌, ఫరూక్‌ ఖాన్‌లు రజక పతకం, ఆదిల్‌, మహమ్మద్‌ సాద్‌, ఉమర్‌, అప్జల్‌, హఫీన్‌ తదితర విద్యర్థులు కాంస్య పతకాలు సాధించారని వెల్లడించారు. ఈ మేరకు విద్యార్థులకు కలెక్టర్‌ సర్టిఫికెట్‌, మెడల్స్‌ అందజేసి అభినందించారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని డీఆర్‌వో మోహన్‌కుమార్‌ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్‌వో మాట్లాడుతూ జనవరి 26న నగరంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. వివిధ శాఖల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగస్తులకు అందించే ప్రశంసాపత్రాల వివరాలు వెంటనే కలెక్టరేట్‌కు పంపాలన్నారు. ఈ నెల 19న కలెక్టర్‌ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో డీఎస్‌పీ సాయినాథ్‌, ఆర్‌డీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.

మట్టినే నమ్ముకున్న రైతుకు వెన్నుదన్నుగా నిలవాలి. నకిలీలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. మేలు రకం విత్తనాలు, ఎరువులు, రసాయన మందులు అందించాలి. అధిక దిగుబడినిచ్చే వంగడాలను అందుబాటులోకి తేవాలి. భూసార పరీక్షలు నిర్వహించి పంట ఎంపికను తెలియజేయాలి..’ అన్న లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అగ్రిటెస్ట్‌ ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఇవి రైతులకు ఎంతగానో ఉపయోగపడేలా చర్యలు చేపట్టింది. గత ఎన్నికల తర్వాత వీటిని నిర్వీర్యం చేయడానికి బాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతులకు ఎక్కడ మేలు జరగకుండా.. గత ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు రాకుండా ఉండేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఫలితంగా ఏవి నకిలీవో.. ఏవి మేలైనవో తెలియక రైతులు తికమకపడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో అగ్రిటెస్ట్‌ ల్యాబ్‌ల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్‌రిపోర్ట్‌.

తూతూమంత్రంగా నిర్వహణ

నగరి: పట్టణంలో 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.68.5 లక్షలతో డాక్టర్‌ వైఎస్సార్‌ అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌ను నిర్మించారు. అప్పటి వరకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను పరీక్షించడానికి తాడేపల్లిగూడెం, హైదరాబాద్‌కు పంపే రైతులకు ఆ సదుపాయం నగరిలోనే వచ్చింది. 2021 జూలై 8న మాజీ మంత్రి ఆర్కే రోజా ఈ ల్యాబ్‌ను ప్రారంభంచారు. నగరి, నిండ్ర, విజయపురం, ఎస్‌ఆర్‌ పురం, పాలసముద్రం, గంగాదరనెల్లూరు మండలాలకు చెందిన రైతులు ఈ టెస్టింగ్‌ ల్యాబ్‌కు విచ్చేసి విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరీక్షించుకునేవారు. 2023లో 546 టెస్టింగ్‌లు ఈ ల్యాబ్‌లో జరిగాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భవనాలపై ఉన్న వైఎస్సార్‌ పేర్లను తీసేయించారు. ల్యాబ్‌కు వెళ్లేందుకు దారి వసతి కల్పించ లేదు. రాత్రిళ్లు టెస్టింగ్‌ ల్యాబ్‌కు వెళ్లేదారే మద్యం బాబులకు బార్‌గా మారిపోతోంది. ఉదయాన్నే ల్యాబ్‌కు విచ్చేసే అధికారులకు ఖాళీ మద్యం సీసాలే దర్శమిస్తున్నాయి. 2025లో ల్యాబ్‌లో 456 టెస్టింగ్‌లు మాత్రమే జరిగాయి. ఈ ల్యాబ్‌లో ఇద్దరు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఒకరు మెటర్నిటీ సెలవులో ఉండడంతో ఒక్కరే నిర్వహణ బాధ్యతలను చేపడుతున్నారు.

పలమనేరు: గత ప్రభుత్వం పలమనేరులోని ఏఎంసీ పరిధిలో రూ.70 లక్షల వ్యయంతో అగ్రిల్యాబ్‌ను నిర్మించింది. 2023లో ఈ ల్యాబ్‌ నిర్మాణం పూర్తయింది. అప్పటి రైతు దినోత్సవం సందర్భంగా అధికారులు ఈ భవనాన్ని ప్రారంభించారు. ఇక్కడ వ్యవసాయశాఖకు సంబంధించిన ఇరువురు జూనియర్‌ అనలిస్ట్‌లు, వెటర్నరీ శాఖకు చెందిన ఇరువురు సిబ్బంది విధుల్లో ఉన్నారు. వీరు ప్రతినెలా వ్యాపారులు, రైతులు, ఫార్ములా మేరకు 50 దాకా టెస్ట్‌లు చేయాలి. రైతులు ఎప్పటికప్పుడు విత్తనాలు, ఎరువుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించుకోవచ్చు. నకిలీ విత్తనాలను గుర్తించవచ్చు. పశువులకు సోకే వ్యాధుల నిర్థారణ సైతం ఇక్కడ తెలుసుకోవచ్చు. గతంలో ఈ సేవలు కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లేవారు. గత ప్రభుత్వం ఈ టెస్టింగ్‌ సెంటర్‌ను స్థానికంగానే అందుబాటులోకి తెచ్చింది. కానీ ఈ సేవలను ట్రేడర్స్‌ మాత్రమే వాడుకుంటున్నారే గానీ రైతులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. నామమాత్రంగా అప్పుడప్పుడు కొన్ని శ్యాంపుల్స్‌ మాత్రం టెస్ట్‌ చేస్తున్నట్టు తెలిసింది. అగ్రిల్యాబ్‌పై సరైన అవగాహన లేకపోవడమే ఈ దుస్థితికి కారణమవుతోంది.

అవగాహన కల్పిస్తే ఒట్టు!

ఈ ప్రాంతంలోని వరి సాగుచేసే రైతులు వరి పండించాక పంట దిగుబడి బాగుంటే ఆ ధాన్యాన్ని అలాగే నిల్వ ఉంచి దాన్ని మరో పంటకు విత్తనాలుగా వాడడం ఆనవాయితీ. అగ్రిల్యాబ్‌లో సిబ్బంది గాని ఆర్‌ఎస్‌కేలోని సహాయకులుగానీ పలమనేరులో ఇలాంటి సేవలు అందుబాటులో ఉండాయని చెబితేగా. దీనిపై గ్రామాల్లో రైతులకు చెప్పి అవగాహన కల్పిస్తే బాగుంటుంది.

– సోమిరామిరెడ్డి, మొరం పంచాయతీ, పలమనేరు మండలం

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య! 
1
1/11

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య! 
2
2/11

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య! 
3
3/11

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య! 
4
4/11

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య! 
5
5/11

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య! 
6
6/11

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య! 
7
7/11

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య! 
8
8/11

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య! 
9
9/11

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య! 
10
10/11

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య! 
11
11/11

పెళ్లి చేసుకోమన్నందుకే హత్య!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement