పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ
రొంపిచెర్ల: పోలీసు బందోబస్తుతో చిత్తూరు జిల్లాలోని పలు రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయాఽధికారులు శుక్రవారం యూరియా పంపిణీ చేశారు. నాలుగు రోజుల క్రితం గానుగచింత రైతు సేవాకేంద్రంలో యూరియా కోసం రైతులు ఘర్షణ పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రొంపిచెర్ల–2, బొమ్మయ్యగారిపల్లె రైతు సేవా కేంద్రాల్లో యూరియాను పోలీసు బందోబస్తు నడుమ పంపిణీ చేశారు. ఒక రైతుకు ఒక బస్తా వంతున యూరియా ఇచ్చారు. రెండు రైతు సేవా కేంద్రాల్లో 800 బస్తాలకు శుక్రవారం 405 బస్తాల యూరియాను పంపిణీ చేసినట్లు ఏవో శ్రావణి తెలిపారు. మిగిలిన యూరియా బస్తాలను సోమవారం ఇస్తామని చెప్పారు. ఏఈవో ఖాదర్‌వల్లీ, వీహెచ్‌ఏలు ఉదయశ్రీ, తిరుమల, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఓబులేసు పాల్గొన్నారు.
90 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
బైరెడ్డిపల్లె : అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న 90 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని నింధితుడ్ని అరెస్ట్ చేసినట్లు సీఐ పరుశురాముడు పేర్కొన్నారు. బైరెడ్డిపల్లె పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గంగవరం మండలానికి చెందిన సురేష్ బొలేరో వాహనంలో బైరెడ్డిపల్లె మీదుగా దేవదొడ్డి నుంచి దాసార్లపల్లె రహదారిలో కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా బియ్యాన్ని తరలిస్తుండగా ఎస్‌ఐ చందనప్రియ సిబ్బందితో కలసి దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పజెప్పారు.
జెడ్పీ సీఈఓ ఆకస్మిక తనిఖీ
గంగాధర నెల్లూరు: మండలంలో శుక్రవారం చిత్తూ రు జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మండలంలోని పాచిగుంట, నెల్లెపల్లె గ్రామ పంచాయతీల ప్రజలు చిత్తూ రులో పిజిఆర్‌ఎస్ కార్యక్రమంలో ఇచ్చిన వినతల మేరకు అయన గ్రామాల లో పరిశీలించారు. అర్జీదారులతో మాట్లాడారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్, సిబ్బంది కుమార్, ప్రశాంత్, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు .
సేంద్రియ వ్యవసాయంతో అధిక ఆదాయం
గంగాధర నెల్లూరు: సేంద్రియ వ్యవసాయంతో రైతులు ఆరోగ్యకరమైన దిగుబడులతో పాటు అధి క ఆదాయం పొందవచ్చని జిల్లా వనరుల కేంద్రం అధికారిణి లక్ష్మీ ప్రసన్న అన్నారు. మండలంలోని నెల్లేపల్లె గ్రామ పంచాయతీలో శుక్రవారం సేంద్రి య వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, సేంద్రియ వ్యవసాయంతో రైతులు రసాయన ఎరువుల జోలికి వెళ్లకుండా పంటలు పండిస్తే ఆరోగ్యకర ఆహారోత్పత్తులు అందించిన వారవుతారన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కోరారు. కార్యక్రమంలో పెరుమాళ్లపల్లె ప్రాంతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సరళ రైతులకు చిరుధాన్యాల సాగుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది వీహెచ్‌ఏ కవిత, ఢిల్లీ ప్రసాద్, రైతులు పాల్గొన్నారు.
పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ
పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ
పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ


