ప్రైవేట్ బడుల్లో వ్యాయామ విద్య తప్పనిసరి
చిత్తూరు కలెక్టరేట్ : ఇకపై ప్రైవేట్ పాఠశాలల్లో వ్యాయామ విద్య తప్పనిసరి అని రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఆదేశించారు. ప్రతి తరగతికి వారానికి ఆరు పీరియడ్లు ప్రత్యేకంగా వ్యాయామానికి కేటాయించాలని, ప్రతి విద్యార్థికి రోజుకు ఒక గంట శారీరక శ్రమ ఉండేలా చూ డాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో కచ్చితంగా వ్యాయామ విద్య అమలు చేయాలని తెలిపారు. పాఠశాల అసెంబ్లీలో ప్రతిరోజూ పది నిమిషాలు ధ్యానం, వారానికి ఒక పీరియడ్ నిర్ధేశించిన సిలబస్ మేరకు ఆరో గ్య విద్యకు కేటాయించాలని సూచించారు. ఆరోగ్య విద్య బోధనా సమయంలో విద్యార్థికి నీతి కథలు, నైతిక విలువలు, మంచి ప్రవర్తన, వంటివి బోధించాలని ఆదేశించారు.
వడ్డెర ఓబన్న
అడుగుజాడల్లో నడుద్దాం
జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు
చిత్తూరు కార్పొరేషన్: వడ్డెర ఓబన్న అడుగుజాడల్లో నడుద్దామని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు అన్నారు. శనివా రం ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఈనెల 11వ తేదీన వడ్డెర ఓబన్న జయంతి అని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చరిత్ర పుటల్లో అలుపెరుగని పోరాట యోధుడు వడ్డెర ఓబన్న అని కొనియాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. ఓబన్న త్యాగాలను స్మరించుకుంటూ రాబోయే తరాలకు ఆయన చరిత్రను తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జెడ్పీ చైర్మన్ ఆకాంక్షించారు.
నాటుబాంబు పేలి
ఆవుకు తీవ్ర గాయాలు
గంగాధర నెల్లూరు : అడవి పందుల కోసం వేటగాళ్లు పెట్టిన నాటుబాంబును ఆవు కొరకడంతో తీవ్ర గాయాల పాలై రైతుకు నష్టం చేకూర్చిన సంఘటన గంగాధర నెల్లూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కొండేపల్లి పంచా యతీ పరిధిలోని పోలినాయుడుపల్లిలో రైతు నారాయణస్వామి నాయుడుకు చెందిన పాడి ఆవు శనివారం పొలంలో గడ్డి మేస్తుండగా వేటగాళ్లు అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబును కొరకడంతో ఆవు నోటి భాగం పేలిపోయింది. వేటగాళ్లు ప్రమాదకరమైన నల్లమందును జనావాసాలలో పెడితే మనుషులకు కూడా ప్ర మాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లమందు పెట్టే వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


