వాట్సాప్‌లో టెట్ ఫలితాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో టెట్ రాసిన అభ్యర్థులు వాట్సాప్‌లో ఫలితాలు చూసుకోవచ్చని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గత ఏడాది డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వర కు పరీక్షలు జరిగాయని చెప్పారు. టెట్ రాసిన అభ్యర్థులు 9552300009 నంబర్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చని డీఈవో వెల్లడించారు.
విఘ్నేశ్వరుని సన్నిధిలో
తనికెళ్ల భరణి
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని బుధవారం సినీనటుడు తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగ తం పలికి దర్శన సేవలు చూశారు. అనంతరం వేద ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు, స్వామి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది వాసు, రవి తదితరులున్నారు.
అయ్యప్పస్వామి సేవలో జెడ్పీ చైర్మన్
సదుం : చిత్తూరు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీని వాసులు మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయాన్ని శనివారం సందర్శించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న ఆయ న ఇరుముడి కట్టుకుని 18 మెట్ల నుంచి అయ్య ప్ప స్వామిని దర్శించుకుని, ఇరుముడి చెల్లించారు. ఆయనను తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఆలయంలో కలుసుకుని ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
వాట్సాప్‌లో టెట్ ఫలితాలు


