కక్షగట్టి.. పక్కన బెట్టి!
అసైన్డ్ భూములకు హక్కులిచ్చి
ఫ్రీహోల్డ్ చేసిన గత ప్రభుత్వం
అర్హతున్న భూములుపై బ్యాన్ పెట్టిన
చంద్రబాబు సర్కార్
గత అక్టోబరులో ఫ్రీహోల్డ్ చేస్తామని చేతులెత్తేసిన కూటమి
బ్యాంకు రుణాలందక రైతన్న తిప్పలు
పలమనేరు: డీకేటీ భూములున్న పేదలు వాటిపై హక్కు లేకుండా పడుతున్న ఇక్కట్లను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గుర్తించింది. ఆ భూములను ఫ్రీహోల్డ్ చేసి భూ యజమానులకు సర్వ హక్కులు కల్పించింది. డీకేటీ భూములు సైతం అప్పట్లో రిజి స్ట్రేషన్లు జరిగాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ భూముల్లో ఎన్నో అక్రమాలున్నాయని, వీటిల్లో అవకతవకలు జరిగాయ ని, ఇందుకు సహకరించిన అధికారులపై విచార ణ చేపట్టాలని భావించింది. ఫ్రీహోల్డ్ భూములపై బ్యాన్ పెట్టింది. నిషేధిత జాబితాలోని ఇంటి స్థలా లు, పొలాలు రిజిస్ట్రేషన్లు లేకుండా పోయా యి. వీటిపై గత నెలలో బ్యాన్ తొలగిస్తామన్న ప్రభుత్వం నవంబరు దాటినా ఆ ఊసే ఎత్తలేదు. పైగా ఎప్పుడు తీసేస్తారో కూడా ఇప్పటి దాకా క్లారిటీ లేదు.
పథకం ప్రకారమే బ్యాన్
ఈ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో 53,917 ఎకరాలు మాత్రమే సక్రమంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇది కూడా వీటిపై బ్యాన్ తీసేశాకే రిజిస్ట్రేషన్లకు అనుమతులట. మిగిలిన భూముల మాటేమిటో అర్థంకావడం లేదు. అసలు ఫ్రీహోల్డ్‌లో అక్రమాలు ఎలా జరిగాయో అధికారులు సైతం ఇంతవరకు రిమార్కులు చెప్పడం లేదు. ఎవరైనా సంబంధిత రిజిస్ట్రర్ కార్యాలయాలకు వెళితే మీ భూమి నిషేధిత జాబితాలో ఉందని చెప్పి పంపేస్తున్నారు. గతంలో సక్రమంగా ఉన్నాయనే వీటిపై క్రయ, విక్రయాలు జరిగాయి. ఇప్పుడు ఇవి రిజిస్ట్రర్ కాకపోతే వారి పరిస్థితేంటి. మొత్తం భూములపై విచారణ జరిపి సవ్యంగా ఉన్న భూముల జాబితా ఇస్తామన్న అధి కారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే మాట గట్టిగా వినిపిస్తోంది.
రకరాల సాకులు..
మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసును సాకుగా చూపి ఈ బ్యాన్ పెట్టినట్టు తెలుస్తోంది. దీంతోపాటు జిల్లాలో ని పలు లేఅవట్లలో భారీ అక్రమాలు జరిగాయని చెబుతున్నారేగానీ అవి ఎలా సాగాయి.. ఇందులో నిజమెంతో సంబంధిత అధికారులు సైతం చెప్పలేకపోతున్నారు. ఇప్పటికై నా నిభందనల మేరకు సక్రమంగా ఉన్న భూములపై నిషేధం ఎత్తివేసి రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతులివ్వాలని పలువురు రైతులు కోరుతున్నారు.
ప్రైవేటుకు కట్టబెట్టేందుకేనా?
డీకేటీగా ఉన్న భూములు పట్టాలుగా మారితే వాటికి ఏల్‌ఏలో తీసుకుంటే ఎక్కువగా నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్రీహోల్డ్‌పై బ్యాన్ పెట్టి ప్రైవేటువారికి కట్టబెట్టాలని బాబు ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ భూములకు నష్టపరిహారం తక్కువగా ఇచ్చి వీటిని కావాల్సిన వారికి కట్టబెట్టే ప్లాన్‌గా ఉందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అసైన్డ్ భూములను వివాదంలోకి నెట్టి 16 నెలలుగా 22–ఏ జాబితాలో పెట్టిందని రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే దీనిపై అర్డినెన్స్ జారీ చేసి క్యాబినెట్ ఆమోదానికి పెడుతున్నట్టు ఆరోపణలున్నాయి.
ఎలాంటి ఆదేశాలు అందలేదు
జిల్లాలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. ఫ్రీహోల్డ్ భూముల సర్వే నెంబర్లతో సహా బ్యాన్ తొలగిస్తే అప్పుడు ఆన్‌లైన్ ఆ సర్వే నెంబర్లను అప్‌లోడ్ చేస్తాం. తర్వాత క్రయ, విక్రయాలు చేసుకోవచ్చు.
– వెంకటరమణమూర్తి, జిల్లా రిజిస్ట్రార్
కక్షగట్టి.. పక్కన బెట్టి!


