మా భూమిని వెబ్‌ల్యాండ్‌లో..
తన పూర్వీకుల భూమిని వెబ్‌ల్యాండ్‌లో అక్రమంగా నమోదు చేయించుకున్నారని ఎస్‌ఆర్‌పు రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బాధితుడు ప్రకాష్ ఆవేదన చెందాడు. ఈ మేరకు కలెక్టరేట్‌లో న్యాయం కో సం అర్జీ ఇచ్చినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ వెంకటాపురం గ్రామంలో తన తండ్రి పేరు మీద వ్యవసాయ భూమి ఉందన్నారు. ఆ భూమి తనకు చెందుతుందన్నారు. అయితే కొందరు అక్రమంగా తమ భూమిని రెవెన్యూ అధికారుల సహకారంతో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. పరిశీలించి తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను వేడుకున్నారు.
వితంతు పింఛన్ ఇప్పించండయ్యా
తనకు వితంతు పింఛన్ ఇప్పించాలంటూ చిత్తూరుకు సరిహద్దులోని చవటపల్లి గ్రామానికి చెందిన శ్రుతి కోరారు. తన భర్త 8 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడన్నారు. ఇద్దరు పిల్లలున్నట్లు తెలిపారు. పెయింటింగ్ పనులు చేసే తన భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో జీవనాధారం లేకుండా పోయిందన్నారు. వితంతు పింఛన్ కోసం రెవెన్యూ, సచివాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోతున్నట్లు తెలిపారు.
మా భూమిని వెబ్‌ల్యాండ్‌లో..


