ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..!
చౌడేపల్లె: నాలుగేళ్లుగా ప్రేమించిన ప్రియుడు పెళ్లి పేరు ఎత్తగానే నిరాకరించాడని మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ ఘటన సోమవారం చౌడేపల్లె మండలం, దిగువపల్లె పంచాయతీ, మిట్టపల్లెలో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం మేరకు.. మిట్టపల్లెకు చెందిన గంగరాజు కుమార్తె గౌతమి(23) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. గత మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. సోమల మండలానికి చెందిన కార్తీక్ అనే యువకుడితో ప్రేమలో పడింది. పెళ్లి పేరు ఎత్తగా గౌతమిని దూరం పెట్టడంతో పాటు ఘర్షణ పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ నాగేశ్వరరావు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
రైలు కిందపడి
గుర్తు తెలియని వ్యక్తి మృతి
వడమాలపేట (పుత్తూరు): మండల పరిధిలోని తడుకు–పూడి రైల్వే మార్గంలో సోమవారం ఉదయం గుర్తుతెలియని మృతి రైలు కిందపడి మృతి చెందాడు. రైల్వే కానిస్టేబుల్ శివకుమార్ కథనం మేరకు.. సుమారు 40 ఏళ్ల వయస్సు కలిగిన మృతుడి ఒంటిపై తెలుపు, సిమెంట్ కలర్ టీషర్ట్, నలుపు రంగు షర్ట్ ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి
గంగాధరనెల్లూరు: చెట్టుకు ఉరి వేసు కుని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మండలంలోని ముక్కళత్తూరు పంచాయతీ, ముష్టిపల్లి గ్రామానికి చెందిన లేట్ వెంకటరెడ్డి కుమారుడు కోదండరెడ్డి(29) బంగారెడ్డిపల్లి సమీపంలోని విద్యుత్ కార్యాలయ సమీపంలో మహదేవమంగళం వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరివేసుకిని వేలాడుతున్నాడు. పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
దామోదరాచారికి
రాష్ట్ర ఉత్తమ కవిత అవార్డు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని యాదమరి జెడ్పీ హైస్కూల్ డ్రాయింగ్ మాస్టర్ దామోదరాచారికి రాష్ట్ర ఉత్తమ కవిత అవార్డు దక్కింది. ఈ మేరకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో సోమ వారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అవార్డు స్వీకరించారు. ఆయన భారతీయతను పొదుగుదాం అనే కవిత రచించి అవార్డుకు ఎంపికయ్యారు. ఉన్నతాధికారులు ఆయనకు నగదు బహుమతి, జ్ణాపికను అందజేశారు.
బావి కోసం రచ్చ
– పోలీసుస్టేషన్‌కు చేరిన పంచాయతీ
చిత్తూరు రూరల్(కాణిపాకం): బావి కోసం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆపై రెవెన్యూ అధికారులు సర్వేకొచ్చారు. ఈక్రమంలో రంపు మొదలైంది. ఇంటిపై దౌర్జన్యం..మళ్లీ కలెక్టర్ ఫిర్యాదు.. తర్వాత పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసుల వివరాల మేరకు.. చిత్తూరు మండలం తాళంబేడు గ్రామానికి చెందిన నటరాజ్‌రెడ్డి(టీడీపీ నేత), అశోక్‌రెడ్డి అన్నదమ్ముళ్లు. వీరికి ఊరు చివరన భూమి ఉంది. భాగపరిష్కారం తర్వాత వీరి ఇరు కుటుంబాల మధ్య కొన్నాళ్లుగా భూ వివాదం నడుస్తోంది. బావి తమది..అంటే తమదని ఆ రెండు కుటుంబాల వారు పంతం పడుతున్నారు. ఈ భూతగదాపై ఇటీవల అశోక్‌రెడ్డి కుమారుడు అరవింద్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు విచారణకు వచ్చారు. ఈక్రమంలో ఆ బావి..మాదే అంటే .. కాదు మాదే అని ఇరుకుటుంబాల వారు రచ్చకు దిగారు. తిట్ల పురాణంతో పాటు తోపులాట జరిగింది. ఇదేమి తలనొప్పిరా దేవుడా అని రిపోర్టు రాసుకుని రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. మళ్లీ అరవింద్ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఈగొడవపై విచారించిన కలెక్టర్ ఈ ప్రాంతాన్ని రెడ్‌మార్క్‌లు పెట్టి గట్టిగా ఇరువర్గాలకు వార్నింగ్ ఇవ్వాలని పోలీసులకు ఆదేశించారు. ఇంతలో నటరాజ్‌రెడ్డి కొడుకు తరుణ్.. అశోక్‌రెడ్డి ఇంటిపై దౌర్జన్యం చేశాడు. తలుపులు పగలగొట్టాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ ముదిరింది. ఆపై ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..!
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..!


