టమాట ధర ఢమాల్!
పలమనేరు: కేవలం రోజులోనే టమాట రైతుల ఆశలు అడియాశలయ్యాయి. పలమనేరు మార్కెట్లో ఆదివారం 14 కిలోల బాక్సు ధర టాప్ రేట్ రూ.1000. సాధరణ ధర రూ.900గా పలికింది. అదే రోజు గడిచేలోపు సోమవారం బాక్సు ధర టాప్‌రేట్ రూ.650, సాధారణ ధర రూ.500 చేరింది. అసలే వర్షాలు, తెగుళ్లతో తీవ్రంగా పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గిన నేపథ్యంలో ఇలా ధరలు ఉన్నట్టుండి పతనం కావడంపై రైతులు నిట్టూర్చుతున్నారు.
శభాష్ స్వామికణ్ణన్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకరచన చేయడం అభినందనీయమని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన సోషల్ స్టడీస్ స్టడీ మెటీరియల్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు స్వామికణ్ణన్ పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పుస్తకం రచించడం గొప్ప విషయమన్నారు. భౌగోళిక చరిత్ర, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం సమ్మిళితమై స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష న్ అండ్ రీసర్చ్ ట్రైనింగ్ నిబంధనలతో రూపొందించిన పుస్తకం బాగుందన్నారు. ఈ పుస్తకం కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇండియన్ స్టాండర్డ్ బుక్ నెంబర్‌తో ఆమోదం పొందడం గొప్ప విషయమన్నారు. స్వామికణ్ణన్‌ను శభాష్ అంటూ కలెక్టర్ అభినందించారు. ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్‌వో మోహన్‌కుమార్ పాల్గొన్నారు.
టమాట ధర ఢమాల్!


