చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో డీఎస్పీ సాయినాథ్ ప్రజ ల నుంచి వినతులు తీసుకున్నారు. మొత్తం 32 ఫిర్యాదులు అందినట్టు ఆయన పేర్కొన్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసా లు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్ చేయడంతో పాటు నిర్ణీ త గడువులోపు సమస్య లు పరిష్కారమయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
బీసీ కులగణన చేపట్టాలి
చిత్తూరు కలెక్టరేట్ : బీసీ కులగణనను వెంటనే చేపట్టాలని ఏపీ బీసీ సమైఖ్య సంఘం రాయలసీమ కో ఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడు జ్ఞానజగదీశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనాభా లెక్కిస్తే గానీ బీసీ కులస్థులు ఎంత మంది ఉన్నారనే సమగ్ర వివ రాలు తెలియవన్నారు. 2011లో 34 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలైన 33 శాతం చట్టసభలలో, 34 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌లు అమలు చేయాలన్నా ముందుగా కులగణన జరపాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ర, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు సెల్వరాజ్, చిత్తూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మహేష్, నాయకులు రవి, జస్టిన్, శరత్, వినాయక, మురుగ, దస్తగిరి పాల్గొన్నారు.
26న దివ్యాంగులకు క్రీడా పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడాపోటీ లు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికా రి బాలాజీ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న అంతర్జాతీయ విభిన్న ప్రతి భావంతుల దినోత్సవం జరుపుకుంటారన్నారు. ఈ మేరకు ఈ నెల 26వ తేదీన ఉదయం 9 గంటలకు చిత్తూరు మెసానికల్ మైదానంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్టు వెల్లడించా రు. ఈ పోటీల్లో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడకు 12 ఏళ్ల నుంచి 21 సంవత్సరాల వయస్సు గల బాల, బాలికలు అర్హులన్నారు. సబ్ జూనియర్, జూని యర్, సీనియర్స్ విభాగాల్లో పోటీల్లో నిర్వహిస్తామన్నారు. అథ్లెటిక్స్‌లో అన్ని వయస్సుల వారు అర్హులన్నారు. షాట్‌పుట్, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, వీల్ చైర్ షాట్‌పుట్, చెస్ పోటీలు నిర్వహిస్తామన్నారు.
పోలీసు గ్రీవెన్స్‌కు 32 ఫిర్యాదులు


