అంబా.. మందుల్లేవ్!
జిల్లా పశువుల ఆస్పత్రి 1 ఏరియా ఆస్పత్రి 14 వెటర్నరీ డిస్పెన్సరీ వైద్యశాలలు 68 లైవ్ స్టాక్ యూనిట్లు 75 రైతు భరోసా కేంద్రాలు 297 పాడి ఆవులు 4.67 లక్షలు గేదెలు 1036
‘నోరున్న మనుషుల కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రుల్లో అన్ని మందులు సమకూర్చుకుంటున్నారు. అరిచి మరీ గీ పెట్టి తెప్పించుకుంటున్నారు. కావాల్సిన చికిత్సలు చేయించుకుంటున్నారు. కానీ మాకు నోరులేదని.. అడగలేమని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మా కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రుల్లో ఏడాదిన్నరగా మందుల్లేవు. అంబా.. అంటూ అరుస్తున్నా ఎవ్వరూ ఆలకించడం లేదు. కనీసం మా గురించి ఏ ఒక్కరూ పట్టించు కోవడం లేదు. ఇదెక్కడి న్యాయం...
ఇంకెన్నాళ్లీ ఘోరం’ అన్నట్టు జిల్లాలోని మూగజీవాలు మౌనంగా రోదిస్తున్నాయి.
జిల్లా సమాచారం


