మాజీ సీఎం ఫొటో ధ్వంసంపై ఫిర్యాదు
చిత్తూరు రూరల్(కాణిపాకం) : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో ధ్వంసంపై గురువారం తాలూకా పోలీసులకు చెర్లోపల్లి సచివాలయ కాంట్రాక్టర్స్ ఫిర్యాదు చేశా రు. చిత్తూరు మండలంలోని చెర్లోపల్లి సచివాలయం బిల్డింగ్ తాళాలు పగలగొట్టి ఆపై సచివాలయం భవనంపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫొటోను ధ్వంసం చేశారని కాంట్రాక్టర్స్ తెలిపారు. అలాగే రన్నింగ్ డోర్స్ ఎలక్ట్రికల్ మెటిరియల్స్, ఇతర విలువైన వస్తువులు చోరీ కి గురయ్యాయని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇదంతా చేయించారని, ఇదంతా టీడీపీ కార్యకర్త వినాయకం నాయుడే చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా దీనిపై తాలూకా పోలీసు స్పందించకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. ఇలాంటివి పురరావృతమైనా...శాంతిభద్రతలకు విఘాతం కలిగిన అందుకే పోలీసులే బాధ్యత వహించాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పూర్ణచంద్ర, రామచంద్ర, బాలసుబ్రమణ్యం, సర్పంచ్ భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ ప్రతిమారెడ్డి తదితరులున్నారు.
140 మంది
ఉద్యోగాలకు ఎంపిక
చిత్తూరు కలెక్టరేట్ : ఉద్యోగమేళాలో 140 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారని సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మనోహర్ తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు గురువారం ఆ కళాశాలలో నియామక పత్రాలను అందజేశారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిర పడేందుకు ఉన్నతాశయంతో విద్యనభ్యసించాలన్నారు. పేద కుటుంబాలకు చెందిన అభ్యర్థులు పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. తిరుపతి చాతుర్య ఎంఐఎం కంపెనీలు తమ కళాశాలలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో 152 మంది అభ్యర్థులు పాల్గొన్నారన్నారు. అందులో 140 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించగా తమ కళాశాల విద్యార్థినులు 130 మంది ఎంపిక కావడం అభినందనీయమన్నారు. అనంతరం ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఉషారాణి, జేకేసీ కో ఆర్డినేటర్ తిరుకుమార్, ప్లేస్మెంట్స్ సెల్ కో ఆర్డినేటర్ షమ్స్‌అక్తర్, విద్యార్థినులు పాల్గొన్నారు.


