పచ్చ మూకల దౌర్జన్యం?
సాక్షి టాస్క్‌ఫోర్స్ : చిత్తూరు మండలంలోని చెర్లోపల్లిలో గుర్తు తెలియని టీడీపీ మూకలు రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి సచివాలయం తాళాలు పగులగొట్టారు. ఆపై సచివాలయంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం అటువైపుగా వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు ఇది గమనించారు. ఇదీ ముమ్మాటీకి టీడీపీ మూకల పనేనని మండిపడ్డారు. జగన్‌మోహన్ రెడ్డి బొమ్మను చూసి తట్టుకోలేక ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కచ్చితంగా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పచ్చ మూకల దౌర్జన్యం?


