పేదలు వైద్య విద్యకు దూరం
యాదమరి : వైద్య విద్యను అభ్యసించి, ప్రజలకు నిస్వార్థ సేవలను అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల కలలను చిదిమేసావు కదా బాబు..అని వైఎస్సార్‌సీపీ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డా.సునీల్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ మనోహర్ అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డా.సునీల్, జడ్పీ వైస్ చైర్మనన్ ధనుంజయరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మాట్లాడుతూ..వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తప్పనిసరిగా ఉండాలని తద్వార పేద విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించాలనే కోరికతో పాటు ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆకాంక్షించారు. అందులో భాగంగానే 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం తమ 17 నెలల పాలనలో వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని అన్నారు. రాష్ట్రంలో మెడికల్ సీట్లు వద్దన్న ఏకై క ప్రభుత్వం ఉంటే అది చంద్రబాబు నేతృత్వంలోని కూటమికే చెందుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కేవలం ఒక సంతకం మాత్రమే కాదని, ఇది కోట్లాది పేదల గుండె నిరసన అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం జడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి పేదల శ్రేయస్సు కంటే కార్పొరేట్ వ్యాపారుల క్షేమమే ముఖ్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యం, వైద్య విద్యపై వ్యాపారం చేయాలనుకోవడం మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శులు నాగశంకర్‌రెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షులు మనోహర్, యాదమరి, ఐరాల, నగరి మండలాల పంచాయతీరాజ్ అధ్యక్షులు రమేష్, ఓబుల్‌రెడ్డి, గోవర్ధన్‌నాయుడు, పూతలపట్టు మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, ఐరాల మండల కన్వీనర్ బుజ్జిరెడ్డి, బంగారుపాల్యం మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి, ఎంపీపీ సురేష్‌బాబు, వైస్ ఎంపీపీలు హరనారాయణరెడ్డి, రవీంద్రబాబు, సర్పంచులు పయని, జేకే రవి, తులసిరెడ్డి, కోటి మందడి, మురళి, పరందామ, సురేష్, మహిళా మండలి అధ్యక్షురాలు రూపవతి, నాయకులు కరుణాకర్, నరేష్, మనోహర్‌రెడ్డి, పండు మందడి, మనోజ్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, దయానందరెడ్డి, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


