పరిశ్రమల ఏర్పాటుకు కృషి
విజయపురం : మండలంలోని కోసలనగరంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ అన్నారు. బుధవారం భూ సేకరణలో భాగంగా ఎమ్మెల్యే భానుప్రకాష్, కలెక్టర్ కోసల నగరంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు 476 ఎకరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఒక ఎకరాకు రూ. 14 లక్షలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలో తమిళనాడు అంబాత్తూరు నుంచి సుమారు 20కి పైగా ఫ్యాక్టరీలు ఇక్కడకు రానున్నాయని, నియోజకవర్గంలోని యువత, యువకులకు ఉపాధి దొరకుతుందని తెలిపారు. అనంతరం వివిధ గ్రామాల్లో వేసిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే భానుప్రకాష్ , కలెక్టర్ ప్రారంభించారు.


