ముత్యపు‘సింహా’సనాన.. మంగళ దాయని
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం రాత్రి అమ్మవారు సింహ వాహనంపై యోగ నరసింహుడి అవతారంలో, ఉదయం ముత్యపుపందిరి వాహనంపై ధనలక్ష్మీ అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. మధ్యాహ్నం శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహించారు. వాహనసేవల్లో పెద్ద జియ్యంగార్, చిన్న జియ్యంగార్, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, సీవీఎస్‌ఓ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు. – చంద్రగిరి
ముత్యపు‘సింహా’సనాన.. మంగళ దాయని
ముత్యపు‘సింహా’సనాన.. మంగళ దాయని


