
ఆ జాప్యాన్ని నివారించాలి
చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ పీఎఫ్ రుణాల తుది మొత్తాల చెల్లింపులో నెలకొన్న తీవ్ర జాప్యాన్ని నివారించాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణను కలిసి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మదన్‌మోహహన్‌రెడ్డి, మోహన్‌యాదవ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటామోహన్ మాట్లాడారు. తమ జీతాల నుంచి ప్రతినెలా పొదుపు చేసుకున్న మొత్తాల నుంచి రుణాలు పొందాలంటే కష్టంగా మారిందన్నారు. పదవీ విరమణ చెందినవారికి తుది మొత్తాలు చెల్లించాల్సి ఉండగా నెలల తరబడి వేచిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిస్సింగ్ క్రెడిట్స్‌కు సంబంధించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జీతాల డ్రాయింగ్ అధికారులను పూర్తి స్థాయిలో భాగస్వాములను చేయాలని కోరారు. పీఎఫ్ మిస్సింగ్ క్రెడిట్స్‌కు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని హామీనిచ్చారు. అనంతరం డిప్యూటీ సీఈఓకు వినతిపత్రం అందజేశారు. నాయకులు దేవరాజులురెడ్డి, చంద్రన్, శేఖర్, వాసు, బాలచంద్రారెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, గుణశేఖర్, ఢిల్లీ బాబు, భరత్, వెంకటేష్ పాల్గొన్నారు.