
ప్రయివేటు అంబులెన్స్ ఢీకొని మహిళ మృతి
ఐరాల: ప్రైవేటు అంబులెన్స్ బీభత్సం సృష్టించింది. తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిలో రోడ్డు పక్కన కూలి పనులు చేస్తున్న మహిళపై దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, అంబులెన్స్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో మహిళ స్వల్పంగా గాయపడింది. కాణిపాకం ఎస్‌ఐ నరసింహులు కథనం.. ఐరాల మండలం, చిగరపల్లెకు చెందిన ప్రమీల(40) తిరువణంపల్లె సమీపంలోని జాతీయ రహదారిపై కూలి పనులు చేయడానికి వెళ్లింది. రోడ్డు పక్కన ఐషర్ వాహనం నుంచి సూచిక బోర్డులను దింపుతుండగా వేగంగా దూసుకొచ్చిన ప్రయివేటు అంబులెన్స్ ప్రమీలను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అదే గ్రామానికి చెందిన ఇంద్రాణికి స్వల్ప గాయాలయ్యాయి. అంబులెన్స్ డ్రైవర్ మాధవ్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతురాలికి భర్త విజయ్‌కుమార్ (తాపీ మేసీ్త్ర), ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అది సరికాదు
చిత్తూరు కలెక్టరేట్ : మెగా డీఎస్సీ అభ్యర్థులకు మే 15వ తేదీ కటాఫ్‌తో డీఎస్సీ అర్హత నిర్ణయించడం సరికాదని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెగా డీఎస్సీ అభ్యర్థులకు వింత నిర్ణయాలు అమలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చే ముందే ప్రతి జిల్లాలో సబ్జెక్టుల వారీగా రోస్టర్ కమ్ మెరిట్‌లో అభ్యర్థులు సాధించిన మార్కులు, రిజర్వేషన్ కేటగిరీ తెలిసే తుది ఎంపిక జాబితా ప్రకటించాలని డిమాండ్ చేశారు.