
కాణిపాక ఆలయ అర్చకుడి కన్నుమూత
ఐరాల: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి అనుసంధానమైన ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న హరీష్(50) సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. కాగా మృతుడు మండల కేంద్రంలోని వీఎస్ అగ్రహారంలో నివాసముంటున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న కాణిపాకం ఆలయం ఈఓ పెంచల కిషోర్ గ్రామానికి చేరుకుని హరీష మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
చిత్తూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని ప్రభుత్వాస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. దాదాపు 80 ఏళ్ల వయస్సున్న వ్యక్తి అనారోగ్యంతో చికిత్స పొందతూ ఆదివారం కన్నుమూశాడు. ఇతని కుటుంబ సభ్యుల వివరాలు లేకపోవడంతో వైద్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వివరాలు తెలిస్తే ఫోన్–9491074517, 9440796706 నంబర్లకు సంప్రదించాలని టూటౌన్ సీఐ నెట్టికంటయ్య కోరారు.
ఏపీసీకి ఉద్యోగోన్నతి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్రశిక్షాశాఖ అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణకు తన మాతృశాఖలో ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మాతృశాఖ అయిన కో–ఆపరేటివ్ శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్‌లో ఉన్న ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లా సమగ్రశిక్షా శాఖ ఏపీసీగా డెప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన మాతృశాఖలో తాజాగా ఆయనకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కేడర్ నుంచి డివిజనల్ లెవల్ కో–ఆపరేటివ్ ఆఫీసర్‌గా ఉద్యోగోన్నతి కల్పించారు. ఉద్యోగోన్నతి కల్పించడంతో పాటు ఆయనకు చిత్తూరు డివిజన్ లెవల్ కో–ఆపరేటివ్ ఆఫీసర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. దీంతో ఆయన ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న జిల్లా సమగ్రశిక్షా శాఖ ఏపీసీగా రిలీవ్ కానున్నారు.

కాణిపాక ఆలయ అర్చకుడి కన్నుమూత

కాణిపాక ఆలయ అర్చకుడి కన్నుమూత