
శరవేగంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఆహ్వాన కటౌట్ ఏర్పాట్లు ఆకట్టుకుంటున్నాయి. ఆలయానికి బ్రహ్మోత్సవ శోభను తీసుకొస్తున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లను పెంచారు. మంగళవారం సాయంత్రం నాటికి ఈ ఏర్పాట్లను పూర్తిచేయనున్నారు. అలాగే 28న జరిగే ధ్వజారోహణాన్ని పురస్కరించుకుని ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేసి పచ్చని పందిరి కొయ్యను నాటారు. కార్యక్రమంలో ఈఓ పెంచల కిషోర్, ఈఈ వెంకట నారాయణ, సిబ్బంది బాలాజీ నాయుడు పాల్గొన్నారు. – కాణిపాకం

శరవేగంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు

శరవేగంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు