
సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
చిత్తూరు అర్బన్: జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎంపికై న అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. సోమవారం చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనను ఎస్పీ మణికంఠ ప్రారంభించారు. ఇటీవల వెలువడ్డ కానిస్టేబుల్ పోస్టుల తుది ఫలితాల్లో 310 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే వెరిఫికేషన్‌కు 296 మంది హాజరయ్యారు. వీళ్లందరి సర్టిఫికెట్లను పరిశీలించారు. త్వరలోనే శిక్షణకు సంబంధించిన కాల్‌లెటర్లు అందుతాయని అధికారులు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడతూ పోలీసు ఉద్యోగమంటే నిజాయితీ, నిబద్ధతతో కూడకున్నదని, సమాజ భద్రతో కానిస్టేబుల్ పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాజశేఖర్‌రాజు, శివానంద కిషోర్, డీఎస్పీ చిన్నికృష్ణ పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 4 కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 72,119 మంది స్వామిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 8 గంటలు పడుతోంది.