
పట్టపగలు ఇంట్లో చోరీ
శ్రీరంగరాజపురం : పట్ట పగలే దొంగతనం జరిగిన సంఘటన మండలంలోని గంగమ్మగుడి వడ్డిఇండ్లు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వడ్డిఇండ్లు గ్రామానికి చెందిన చిట్టబాబునాయుడు కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం కావడి ఎత్తుకొని తిరుత్తణికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని దొంగలు ఇంటిలోకి చొరబడి 40 గ్రాముల బంగారం, కేజీ వెండి, 30 వేల రూపాయల నగదు చోరీ చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. గ్రామాల్లో ఎవరైన అనుమానితులుగా కనబడితే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్‌ఐ సుమన్ తెలిపారు.