
గంగమ్మా.. కూటమికి మంచి బుద్ధి కల్గించమ్మా
– ఎంపీ విడుదల కావాలని పూజలు, అభిషేకాలు
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మా.. కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి కల్గించమ్మా .. అంటూ మండలంలోని కాటిపేరి పంచాయతీ వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అక్రమ కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల కావాలని కోరుతూ 101 టెంకాయలు కొట్టి మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పేరిట అభిషేకాలు చేయించారు. అక్రమ కేసు నుంచి ఎంపీ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆకాక్షించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, వైస్ ఎంపీపీలు నరసింహులు యాదవ్, సుధాకర్‌రెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, మాజీ ఎంపీపీ అంజిబాబు ,పార్టీ మండల ఉపాఽఽధ్యక్షుడు వెంకటరమణ, సింగిల్ విండో మాజీ చైర్మన్ రవిచంద్రారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కళ్యాణ్‌భరత్, సర్పంచ్ సరిత, నాయకులు శ్రీనివాసులు, రంగనాథ్, గంగిరెడ్డి, రాజారెడ్డి, చంద్రారెడ్డి, రాజప్ప, శ్రీకాంత్ ,షంషీర్, చెంగారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, నరేష్, గణేష్, సాధిక్ తదితరులు ఉన్నారు.

గంగమ్మా.. కూటమికి మంచి బుద్ధి కల్గించమ్మా