
తెలుగు వెలుగుకు చర్యలు ..
– 8లో
– 8లో
మహా సంకల్ప దీక్షతోనే తెలుగుకు ప్రాభవం సాధ్యమని తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్షుడు పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ ఓ కుట్ర
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఎస్సీ వర్గీకరణ పేరిట దళితుల ఐక్యతను దెబ్బ తీసేందుకు దేశ వ్యాప్త కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అనేది నరేంద్ర మోదీ చేస్తున్న పెద్ద కుట్ర అన్నారు. ఈ కుట్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాగస్వాములన్నారు. మాల సామాజిక వర్గంపై బాబు పగబట్టి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టి ఈ దేశాన్ని విభజించి పనిలో బీజేపీ ఉందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ పేరుతో ఎస్సీల్లో చిచ్చు పెట్టేందుకే వర్గీకరణను తెర పైకి తీసుకొచ్చారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు దేవా, ఉదయ్ కుమార్, సంతోష్ కుమార్, మహాసముద్రం కృష్ణ, బుల్లెట్ బాబు, ఏసు పాల్గొన్నారు.