
గ్లోబల్ హెల్త్‌కేర్ క్యాపిటల్‌గా భారత్
– అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ డా.ప్రతాప్ సి రెడ్డి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): భవిష్యత్తులో భారత్ ప్రపంచ హెల్త్‌కేర్ క్యాపిటల్‌గా అవతరిస్తుందని, ఇందు కోసం అపోలో యూనివర్సిటీ గొప్ప విజన్‌తో ముందడుగు వేస్తోందని అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్, అపోలో యూనివర్సిటీ చాన్సలర్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం చిత్తూరులోని అపోలో నాలెడ్జ్ సిటీలో విద్యార్థులు, అధ్యాపకులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా భారత వైద్యుల ఆధిపత్యాన్ని గుర్తుచేస్తూ.. అమెరికాలో దాదాపు 10 శాతం, యుకేలో 25–30 శాతం వరకు హెల్త్‌కేర్ రంగంలో భారత వైద్యులే కీలక స్థానాలు దక్కించుకున్నారని పేర్కొన్నారు.