29, 30 తేదీల్లో సీఎం కుప్పం పర్యటన | - | Sakshi
Sakshi News home page

29, 30 తేదీల్లో సీఎం కుప్పం పర్యటన

Aug 24 2025 7:31 AM | Updated on Aug 24 2025 12:12 PM

కుప్పం: సీఎం చంద్రబాబు ఈ నెల 29, 30వ తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు కడా పీడీ వికాస్‌ మర్మత్‌ తెలిపారు. శనివారం కుప్పం కడా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ పనులు పూర్తి కావడంతో కృష్ణా జలాలు కుప్పానికి వస్తున్నాయని, ఈ కార్యక్రమంలో భాగంగా జలహారతి కోసం సీఎం కుప్పంలో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 29వ తేదీన సాయంత్రం కుప్పం పట్టణానికి చేరుకుని, 30వ తేదీ ఉద యం మండలంలోని పరమసముద్రం చెరువు వద్ద జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్‌ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా పరమసముద్రం చెరువును నీటితో నింపి అనంతరం దశల వారీగా నియోజకవర్గంలోని 435 చెరువులను అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, పీఎంకే ఉడా చైర్మన్‌ సురేష్‌బాబు, కడా అభివృద్ధి కమిటీ సభ్యులు రాజ్‌కుమార్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుశాఖలో స్వచ్ఛత దివాస్‌

చిత్తూరు అర్బన్‌: స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛత దివాస్‌ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో పరిశుభ్రత కార్యక్రమా న్ని నిర్వహించారు. చిత్తూరులోని పోలీసు శిక్షణ కేంద్రం(డీటీసీ)లో మొక్కలు నాటారు. శనివారం ఏఎస్పీ రాజశేఖర్‌ రాజు, అధికారు లు కలిసి డీటీసీలో పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. అనంతరం స్వచ్ఛ దివాస్‌పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ ఏఎస్పీ శివానంద కిషోర్‌, డీఎస్పీలు చిన్నికృష్ణ, మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

వెరిఫికేషన్‌కు ధ్రువీకరణ తప్పనిసరి

చిత్తూరు అర్బన్‌: పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు తప్సనిసరిగా ఓ ఫారంను డౌన్‌లోడ్‌ చేసుకుని ధ్రువీకరణ చేసుకుని వెరిఫికేషన్‌కు రావాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ తెలిపారు. సోమవారం చిత్తూరులోని ప్రశాంత్‌ నగర్‌లో ఉన్న జిల్లా పోలీసు కార్యాలయంలో 9 గంటల నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరుగుతుందన్నారు. దీనికి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అనెగ్జర్‌–1 డౌన్‌లోడ్‌ చేసుకుని గెజిటెడ్‌ అధికారితో ధ్రువీకరించుకుని రావాలని ఎస్పీ కోరారు.

సర్వే చేసి అనర్హురాలిగా ముద్రవేశారు!

పలమనేరు: మండలంలోని టి. వ డ్డూరు గ్రామానికి చెందిన పాపులమ్మ (69) పక్షవాతం కా రణంగా కాళ్లు చచ్చుబడిపోవడంతో సరిగ్గా నడవలేదు. సదరం సర్టిఫికెట్‌లో 40 శాతం కంటే ఎ క్కువగా వికలత్వం ఉందని ఆమెకు మొన్నటి దాకా వికలాంగ పింఛన్‌ ఇచ్చేవారు. ఇటీవల జరిగిన పించన్ల పునఃపరిశీలనలో వికలత్వ శాతం 40 కంటే తక్కువగా ఉందని పింఛను తీసేశారు. ప్రస్తుతం ఈమె మధుమేహం, రక్తపోటుతో అనారోగ్యంతో పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈమె భర్త చిన్నపాటి చిల్లర దుకాణం ద్వారా భార్యను చూసుకుంటున్నాడు. అతనికి అనారోగ్య సమస్యలున్నాయి. వీరి ఇద్దరు పిల్లలకు వివాహమై వారి కుటుంబాలను వారు చూసుకుంటున్నారు. దీంతో వారికి ఆసరాగా ఉన్న పింఛను పోవడంతో ఎలా బతికేదో దేవుడా? అని బాధపడుతున్నారు.

28 లోపు పేర్లు నమోదు చేసుకోండి

చిత్తూరు కలెక్టరేట్‌ : ఏపీ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 28వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని ఏపీ స్టేట్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌ఆర్‌బీ ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు 28వ తేదీ లోపు 9849313676, 9000475799 నంబర్లకు ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పేర్లు నమోదు చేసుకుని క్రీడాకారుల కు పోటీల్లో పాల్గొనే అవకాశం ఉండదన్నారు.

29, 30 తేదీల్లో సీఎం కుప్పం పర్యటన 
1
1/2

29, 30 తేదీల్లో సీఎం కుప్పం పర్యటన

29, 30 తేదీల్లో సీఎం కుప్పం పర్యటన 
2
2/2

29, 30 తేదీల్లో సీఎం కుప్పం పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement