
జగమంత పండుగ
వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
కాణిపాకంలో ఉట్టిపడుతున్న ఉత్సవశోభ
27 నుంచి కాణిపాక వార్షిక బ్రహ్మోత్సవాలు
భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళికలు
వరసిద్ధుడి వేడుక..
కాణిపాకం: స్వయంభు వరసిద్ధి వినాయకస్వామివారికి ఈ నెల 27వ తేదీన వినాయక చవితి మొదలు 21 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలకు ఆలయాధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వరసిద్ధి వినాయకస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఆలయానికి పెయింటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. భక్తులు ఉండేందుకు తాత్కాలిక షెడ్లు, విద్యుత్ కటౌట్లు, రంగువల్లులతో ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఈ పనులను పూర్తి చేయనున్నారు. బ్రహ్మోత్సవాలకు రెండు రోజులకు ముందే అన్ని ఏర్పాట్లను వందశాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ పనులను ఈఓ పెంచల కిషోర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

జగమంత పండుగ