
ఆభరణాల చోరీ
చిత్తూరు అర్బన్: నగరంలోని కట్టమంచి లాయర్స్ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో శనివారం తెల్లవారుజామున ఆభరణాల చోరీ జరిగింది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన రామచంద్ర లాయర్స్ కాలనీలో కాపురముంటున్నారు. శుక్రవారం కలకడలోని తన బంధువుల ఇంటికి వెళ్లి, శనివారం ఉద యం ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూడగా.. వస్తువులు చిందరవందరగా పడున్నాయి. తీరా లోపలికి వెళ్లి చూడగా కిటీకీ తొలగించి, ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించాడు. 15 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గంగాధర నెల్లూరు: ద్విచక్ర వాహనంలో అతివేగంగా వెళుతూ రోడ్డు పక్కన ఉన్న షాపును ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. వేల్కూరు సమీపంలో ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అశోక్ కుమార్ (28) పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో అగరమంగళం నుంచి వేల్కూరుకు ద్విచక్ర వాహనంలో తన తోటి కార్మికుడు కృష్ణకుమార్‌తో కలిసి బయలుదేరాడు. జీడీ నెల్లూరులో ద్విచక్రవాహనాన్ని అతివేగంగా నడపడంతో నియంత్రణ కోల్పోయి ఓ షాపును ఢీకొన్నాడు. ఈ ఘటనలో అశోక్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చుని ఉన్న కృష్ణకుమార్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో రూ.2.10 లక్షల జరిమానా
చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన 21 మందికి రూ.2.10 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్స్‌పల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి శనివారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువు రు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 21 మందిపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.2.10 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
ఆంధ్రకేసరికి నివాళి
చిత్తూరు అర్బన్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకు చిత్తూరు పోలీసుశాఖ ఆధ్వరంలో పోలీసులు నివాళులర్పించారు. ఆయన జయంతిని పురస్కరించుకుని శనివారం చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రకాశం పంతులు చిత్రపటం వద్ద ఎస్పీ మణికంఠ, అధికారులు నివాళులర్పించారు. స్వతంత్ర పోరాట యోధుడిగా, ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చూపిన ధైర్యసాహసాలు, తీసుకొచ్చిన సంస్కరణలు నేటితరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, ఏఆర్ డీఎస్పీ మహబూబ్‌బాషా, కార్యాలయ ఏఓ నాగభూషణమ్మ, ఎంటీఓ చంద్రశేఖర్, డీసీఆర్‌బీ ఎస్‌ఐ పద్మ తదితరులు పాల్గొన్నారు.
బార్‌కు లాటరీ
నిర్వహించకపోతే ఫీజు వాపసు
చిత్తూరు అర్బన్: ఏదైనా మద్యం బార్ లైసెనన్స్ కోసం కనీసం నాలుగు దరఖాస్తులు రాకపోయినా, లాటరీ నిర్వహించలేకపోయినా దరఖాస్తు ఫీజు తిరిగి చెల్లిస్తామని చిత్తూరు ఎకై ్స జ్ సూపరింటెండ్ శ్రీనివాస్ తెలిపారు.