
మహిళ ఆత్మహత్య
పుంగనూరు: భర్త మందలించాడని భార్య పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వనమలదిన్నెలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని వనమలదిన్నెకి చెందిన భాస్కర్ భార్య దుర్గ(34) తన పిల్లలను మందలిస్తుండగా భర్త ఆమెను మందలించాడనే కోపంతో ఇంట్లో ఉన్న పురుగుల మందుతాగి ఆత్మహత్య పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు శవాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.