
రాష్ట్రంలో అరాచకపాలన
చౌడేపల్లె: శివయ్యా..రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి మంచి బుద్ధి ప్రసాదించయ్యా అంటూ పుదిపట్ల పంచాయతీకి చెందిన వైఎస్సార్ సీపీ నేతల ఆధ్వర్యంలో పంచలింగేశ్వరస్వామివారికి శనివారం అభిషేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.దామోదరరాజు, పార్టీ మండల అధ్యక్షుడు జి. నాగభూషణరెడ్డి మాట్లాడుతూ అక్రమ కేసుల నుంచి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల కావాలని కోరుతూ పెద్దిరెడ్డి కుటుంబం పేరిట పంచ లింగేశ్వరస్వామి ఆలయంలో అభిషేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం గద్దె ఎక్కినప్పటి నుంచి ప్రజలకిచ్చిన హామీలు విస్మరించి వైఎస్సార్‌సీపీ నేతలను వేధించడం, పోలీసులను అడ్డంపెట్టుకుని కేసులు పెట్టడంపై దృష్టి పెట్టారని ఆరోపించారు. పేదల హామీల సంగతి విస్మరించి పరిశీలన పేరుతో దివ్యాంగులు పింఛన్ల కోత విధిస్తుందని, చిరుఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించి, వారి కడుపుకొడుతుందన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న ప్రజాధరణ చూసి ఓర్వలేక రాజకీయ కుట్రలతో ఎల్లో మీడియా ద్వారా దుష్పచారం చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోయకొండ పాలకమండలి మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ, సర్పంచుల సంఘ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రామనారాయణరెడ్డి, వెంకటరెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ రవిచంద్రారెడ్డి, సర్పంచులు హారతి, ఓబుల్‌రెడ్డి, షంషీర్, నాయకులు రెడ్డెప్పరెడ్డి, భరత్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, నాగభూషణరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, చెంగారెడ్డి, నరేష్, శ్రీరాములు, గిరినాథ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాజారెడ్డి, యశోద, అనుప్రియ తదితరులు పాల్గొన్నాన్నారు.