
వర్షం.. అపార నష్టం
గుడిపాల: మండలంలో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. పొలాలన్నీ నీటితో నిండిపోయాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరి పంట కోతకు వస్తున్న దశలో గాలివాన కురవడంతో వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. మండలంలో ప్రస్తుతం 115 హెక్టార్లలో వరి పంట పొట్ట, కోత దశలో ఉంది. కోత దశలో ఉన్న 20 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. రైతులు అప్పు చేసి సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయంలో దెబ్బతినడంతో వారు లబోదిబోమంటున్నారు. మండలంలోని చింతగుంటూరు, బొమ్మసముద్రం, 197రామాపురం, కోటూరు, తిమ్మయ్యపల్లెలో వర్షానికి దెబ్బతిన్న వరిపంటను వ్యవసాయాధికారి సంగీత పరిశీలించారు. పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు ఆమె తెలిపారు. కొన్ని గ్రామాల్లో అరటి పంట కూడా దెబ్బతింది. మరకాలకుప్పం గ్రామంలో వేరుశనగ పంట నీట మునిగింది. అలాగే మామిడి, నిమ్మతోటల్లో నీరు నిలిచిపోయింది.

వర్షం.. అపార నష్టం