
కర్ణాటక వాసి మృతి
బైరెడ్డిపల్లె: మండలంలోని బేలుపల్లె సమీపం వద్ద శనివారం వ్యవసాయబావిలో కర్ణాటక వాసి మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు..కర్ణాటక రాష్ట్రం పెద్దగుట్టపల్లె గ్రామానికి చెందిన అశ్వత్త (40) మండలంలోని పిచ్చిగుండ్లపల్లెలో అక్కను చూడటానికి రెండు రోజుల క్రితం వచ్చాడు. గ్రామ సమీపంలో ఉన్న పొలాల వద్దకు వెళ్లిన అశ్వత్త ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. బావిలో మృతదేహం గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పలమనేరు ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.