
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
కార్వేటినగరం: కార్వేటినగరంలోని రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు మంగళవారం వైభవంగా అంకురార్పణ చేపట్టారు. స్వామివారిని వేకువ జామున మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉభయ దేవేరులతోపాటు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం అంకురార్పణ కార్యక్రమానికి ముందే పవిత్రమైన పుట్టమట్టితో ఆలయ ఆవరణలో మేదినీ దేవిని ప్రతిష్టించి అత్యంత వైభవంగా పూజలు, పుణ్యాహవచనం చేపట్టారు. అనంతరం సాయంత్రం సేనాధిపతి ఉత్సవ సమర్పణ, రాత్రి మృత్సంగ్రహణం, అంకురార్పణ, యాగశాల, వైదిక కార్యక్రమాలు చేపట్టారు. విశ్వక్సేనుని ప్రత్యేక వాహనంలో ప్రతిష్టించి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, ఆలయ అధికారి సురేష్‌కుమార్, షరాబ్ బాబుసురేష్, వేద పండితులు రమేష్, శభరీష్, గోపాలస్వామి పాల్గొన్నారు.
నేడు పవిత్రాల
సమర్పణ
బుధవారం ఉదయం కోదండరామస్వామికి ఏకాంత తిరుమంజనం, యాగశాలలో మధ్యా హ్నం వేణుగోపాలస్వామి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్టు ఆలయ ఆధికారి సురేష్‌కుమార్ తెలిపారు. తర్వాత పవిత్రాల సమర్పణ ఉంటుందన్నారు.

పవిత్రోత్సవాలకు అంకురార్పణ