
ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా ఏరువాక కేంద్ర కో–ఆర్డినేటర్ రామకృష్ణారావ్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా ఏరువాక కార్యక్రమంలో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ దృష్ట్యా జిల్లాలో మంగళ, బుధవారాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమా న్ని నిర్వహిస్తామన్నారు. అలాగే తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించి సాగు విస్తీర్ణం పెంచేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు.