
అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ
పెద్దపంజాణి: మండలంలోని రాజుపల్లి పంచాయతీ, కమ్మినాయునిపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని మండల ప్రత్యేకాధికారి, చిత్తూరు వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ మంగళవారం తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, రికార్డులను పరిశీలించారు. తదుపరి రాజుపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గత మూడేళ్ల మట్టి నమూనా ఫలితాలను పరిశీలిస్తే మన నేలల్లో సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్నందున రైతులు తప్పకుండా పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగను వేయాలన్నారు. యూరియా ఎక్కువగా వాడడం వల్ల కలిగే అనర్థాలు, నానో యూరియా వల్ల ఉపయోగాలను వివరించారు. అన్నదాత సుఖీశవ రాని రైతులు రైతు సేవా కేంద్రంలో 20వ తేదీలోగా గ్రీవెన్స్ నమోదు చేయాలన్నారు. తర్వాత గ్రామం సమీపంలో రైతులు సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఆయన వెంట పుంగనూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శివకుమార్, ఏఓ హేమలత, పంచాయతీ కార్యదర్శి రిజ్వానా, వీఆర్వో కృష్ణంరాజు ఉన్నారు.